Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tollywood Dancers :  సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్‌?

Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్‌?

NTV Telugu 3 weeks ago

టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత కార్యవర్గంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న మెజార్టీ డ్యాన్సర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తమ సమస్యలను పరిష్కరించి, యూనియన్‌ను ముందుకు నడిపించే సత్తా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌ను అసోసియేషన్ నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న సుమలత, ఆమె కార్యవర్గ తీరును వ్యతిరేకిస్తూ డ్యాన్సర్లు మూకుమ్మడిగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.

ఇందులో భాగంగా సుమలత ప్యానెల్‌కు ఇప్పటికే అధికారికంగా సహాయ నిరాకరణ ప్రారంభించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పాత కార్యవర్గం వ్యవహార శైలిపై అసహనంతో ఉన్న సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. రఘు మాస్టర్ నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్న డ్యాన్సర్లు, ఫిల్మ్ ఫెడరేషన్ తలుపు తట్టేందుకు సిద్ధమయ్యారు. రఘు మాస్టర్ నేతృత్వంలోని కొత్త కార్యవర్గానికే అధికారికంగా మద్దతు ఇవ్వాలని ఫెడరేషన్‌ను మెజార్టీ సభ్యులు నేరుగా కోరనున్నారు. దాదాపు యూనియన్ మొత్తం ఒకే మాటపై నిలబడి తిరుగుబాటు చేయడంతో, అసోసియేషన్ పగ్గాలు రఘు మాస్టర్ చేతికి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu