Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Toxic: 'టాక్సిక్' నుంచి 'తబాహి' సాంగ్ విడుదల.. యష్, కియారా కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా

Toxic: 'టాక్సిక్' నుంచి 'తబాహి' సాంగ్ విడుదల.. యష్, కియారా కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా

NTV Telugu 1 week ago

Toxic: కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యశ్ ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆయన నటిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్, టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుండగా, తాజాగా విడుదలైన ‘తబాహి’ వీడియో సాంగ్ ఇప్పుడు ఆ హైప్‌ను మరింత పెంచింది. యాక్షన్‌తో పాటు సినిమాలో బలమైన ప్రేమకథ కూడా ఉండబోతుందనే సంకేతాలను ఈ పాట స్పష్టంగా అందించింది.

కొద్ది రోజుల క్రితం వచ్చిన క్లిప్స్ లో అడల్ట్ టోన్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు విడుదలైన వీడియో సాంగ్ లో ప్రేమలో మునిగిపోయిన యశ్, కియారాలను దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఎంతో అందంగా చూపించారు. ఈ పాటలో యశ్ ఇప్పటివరకు కనిపించని కొత్త కోణంలో కనిపించడం అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు కియారా అద్వానీ తన స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్‌తో ప్రతి ఫ్రేమ్‌ను మరింత అందంగా మార్చారు. వీరిద్దరి మధ్య కనిపించే ఐ కాంటాక్ట్, రొమాంటిక్ మూమెంట్స్ అప్పుడే సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఈ కొత్త జోడీ తెరపై అద్భుతమైన కెమిస్ట్రీని పండిస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా ఈ పాటకు స్వరాలు సమకూర్చడమే కాకుండా స్వయంగా ఆలపించారు కూడా. తెలుగు వెర్షన్‌కు ప్రముఖ గేయరచయిత రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం హృదయానికి హత్తుకునేలా ఉంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ‘టాక్సిక్’ ఇప్పటికే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. యాక్షన్, ప్రేమకథను సమపాళ్లలో చూపిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీతో పాటు నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం 2026 ఆగస్టు 26న బహుభాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu