Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు

Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు

NTV Telugu 3 weeks ago

మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. వీకెండ్‌ ఓపెనింగ్‌లో భారీ వసూళ్లతో దూసుకెళ్లిన ఈ సినిమా వర్కింగ్ డేస్‌లో కూడా అదే జోరును కొనసాగిస్తూ..

కేవలం నాలుగు రోజుల్లోనే 100కోట్ల మార్కును దాటేసింది. రీజినల్ సినిమాల బాక్సాఫీస్ పరంగా పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఇదే జోష్‌లో లాంగ్‌ రన్‌లో భారీ వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఇరుముడి స్పీడ్‌కు యష్ ‘టాక్సిక్’ మూవీ బ్రేక్ వేసినట్టైంది. ఆగష్టు 26న టాక్సిక్ భారీ ఎత్తున విడుదల కావడంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఇరుముడికి థియేటర్ల సంఖ్య తగ్గింది.

దీంతో ఇరుముడి పై గట్టి ఎఫెక్ట్ పడేలా ఉందని అనుకున్నారు. అందులోను టాక్సిక్‌కు హిట్ టాక్ వస్తే.. ఇరుముడికి థియేటర్లతో పాటు వసూళ్లు మరింత తగ్గుతాయని అనుకున్నారు. కానీ, ఇప్పుడు టాక్సిక్ టాక్ ప్రకారం.. ఇరుముడికి తిరుగులేదనే చెప్పాలి. కెజీయఫ్ తర్వాత యష్ నుంచి వచ్చిన సినిమా కావడంతో.. టాక్సిక్ పై రిలీజ్‌కు ముందు భారీ హైప్ క్రియేట్ అయింది. కానీ, అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా లేదనే టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్‌డమ్ కాపాడుకోవాలని ప్రయత్నించిన యష్‌కు నిరాశ తప్పదని రివ్యూలు చెబుతున్నాయి. ఖచ్చితంగా ఇది ఇరుముడికి కలిసొచ్చేలా ఉంది. టాక్సిక్‌కు డివైడ్ టాక్ రావడంతో.. మళ్లీ బాక్సాఫీస్ దగ్గర ఇరుముడి హవా స్టార్ట్ అయినట్టే. రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ సినిమా నిలిచేలా ఉంది. ఏదేమైనా.. రెండో రోజే బ్రేక్ ఈవెన్ అయిన ఇరుముడి.. మేకర్స్‌కు భారీ లాభాలు తెచ్చిపెట్టడం గ్యారెంటీ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu