Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?

Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?

NTV Telugu 5 days ago

Tree Trimming Job: కేవలం గంటపాటు పని చేసి దాదాపు రూ.49 వేల వరకు సంపాదిస్తే ఎలా ఉంటుంది..? అబ్బో ఇంకేం కావాలి అనుకుంటారా..? అవును ప్రస్తుతం ట్రేడ్ స్కిల్స్‌కు ఉన్న డిమాండ్‌ను చూపించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కెనడాలో నివసిస్తున్న భారతీయుడు విశాల్ తన ఇంటి వద్ద జరిగిన ఓ అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అయ్యింది.

విశాల్ తెలిపిన వివరాల ప్రకారం, తన ఇంటి వద్ద పెరిగిపోయిన చెట్ల కొమ్మలను కత్తిరించేందుకు ఒక ప్రొఫెషనల్ ట్రీ ట్రిమ్మర్‌ (చెట్లను నరికే వ్యక్తి)ను పిలిచాడు. ఆ పని పూర్తి చేయడానికి సుమారు గంట సమయం మాత్రమే పట్టిందట. కానీ అందుకు అతడు చెల్లించిన మొత్తం CAD 700, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.49,000కు పైగానే ఉంది. ఈ విషయం విన్న చాలా మంది ఆశ్చర్యపోయినా.. విశాల్ మాత్రం ఇది సాధారణ విషయమేనని తెలిపాడు.

కెనడాలో ఇలాంటి ట్రేడ్ ఉద్యోగాలకు భారీ డిమాండ్ ఉంటుందని చెప్పాడు. చెట్ల కత్తిరింపు పని అనేది కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని.. దీనికి ప్రత్యేక నైపుణ్యం, ఖరీదైన యంత్రాలు, ట్రక్కులు, భద్రతా పరికరాలు అవసరమవుతాయని వివరించాడు. అలాగే ఈ పనిలో ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పాడు. చెట్టు కొమ్మలు పడే సమయంలో ఎవరికైనా గాయాలు కావడం లేదా ఇళ్లకు నష్టం కలగడం వంటి ప్రమాదాలు ఉండటంతో ఇన్సూరెన్స్ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని తెలిపాడు. అందుకే ఈ సేవలకు అధిక ఛార్జీలు వసూలు చేస్తారని పేర్కొన్నాడు.

ఇంకా ఈ ఫీజులో ఇంధనం, కమర్షియల్ ఇన్సూరెన్స్, మెషిన్ మెయింటెనెన్స్, లైసెన్సింగ్, పన్నులు వంటి వ్యాపార ఖర్చులు కూడా ఉంటాయని తెలిపాడు. వేసవిలో చెట్ల కత్తిరింపు పనులు చేసే ఈ కార్మికులు, చలికాలంలో మంచు తొలగింపు పనులు చేస్తూ ఏడాది పొడవునా ఆదాయం పొందుతారని చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ట్రేడ్ స్కిల్స్‌కు విశేష గౌరవం ఉంటుందని చాలామంది అభిప్రాయపడ్డారు. ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్, ల్యాండ్‌స్కేపింగ్, స్నో క్లియరింగ్, ట్రీ ట్రిమ్మింగ్ వంటి ఉద్యోగాలు చాలాసార్లు వైట్ కాలర్ ఉద్యోగాల కంటే ఎక్కువ ఆదాయం తెచ్చిపెడతాయని వ్యాఖ్యానించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu