Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TVK Vijay: విజయ్‌కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన

TVK Vijay: విజయ్‌కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన

NTV Telugu 2 weeks ago

మిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుంది.

దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను విజయ్ కలిసి కోరారు. ఈ సందర్భంగా 112 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశారు. రెండు వారాల్లో బలపరీక్షలో మెజారిటీ నిరూపించుకుంటానని విజ్ఞప్తి చేశారు. కానీ విజయ్ విజ్ఞప్తిపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయ్ వాదనతో గవర్నర్ ఏకీభవించేందుకు సిద్ధంగా లేనట్లుగా లోక్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో బిగ్ షాక్ తగిలినట్లైంది.

తాజాగా చిన్న పార్టీలు కూడా ఝలక్ ఇచ్చాయి. విజయ్‌కు కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వగా.. మిగతా చిన్న పార్టీలైన వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు మాత్రం మద్దతు ఇచ్చేందుకు నిరాకరించాయి. ఈ చిన్న పార్టీల దగ్గర చెరో రెండేసి సీట్లు ఉన్నాయి. ఈ పార్టీలు మద్దతు ఇస్తే.. ప్రభుత్వం ఏర్పడిపోతుంది. కానీ ఈ చిన్న పార్టీలు విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు ససేమిరా అన్నాయి. డీఎంకేతోనే పొత్తు కొనసాగిస్తామని ప్రకటించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ ఎలా ముందుకు వెళ్తారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu