US-Iran ceasefire: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో ప్రతిష్టంభన ఏర్పడింది. అమెరికా ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించింది. ఈ విషయంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ మౌనంగా ఉండిపోయింది.
తాత్కాలిక కాల్పుల విరమణకు టెహ్రాన్ సుముఖంగా లేదని, దానికి బదులుగా “యుద్ధానికి శాశ్వత ముగింపు” అవసరాన్ని ఇరాన్ నొక్కి చెప్పింది.
Supreme Court: ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయరు.?.. బెంగాల్ అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
ఇరాన్ కాల్పుల విరమణతో పాటు 10 షరతులు విధించింది. ఈ షరతుల్లో ఈ ప్రాంతంలో ఘర్షణలకు ముగింపు పలకడం, హార్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి భరోసా ఇవ్వడం, తమపై ఉన్న ఆంక్షలు ఎత్తేయడం, పునర్నిర్మానానికి ఏర్పాట్లు చేయడం వంటివి ఇరాన్ కీలక డిమాండ్లుగా ఉన్నాయి. మరోవైపు, పాకిస్తాన్ మద్దతుతో రూపొందిన కాల్పుల విరమణ ప్రతిపానలపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయలేదని వైట్‌హౌజ్ అధికారి చెప్పారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుందని చెప్పారు.

