Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..

US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ.. 42 విమానాలు ధ్వంసం..

NTV Telugu 4 days ago

US-Iran War: అమెరికా-ఇరాన్ యుద్ధం ఇంకా ముగియలేదు. ఇప్పటికీ రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరోవైపు, యూఎస్-ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు యుద్ధంలో ఎంత నష్టం సంభవించిందో అమెరికా అధికారికంగా బయటపెట్టలేదు. కానీ కొన్ని నివేదికల ప్రకారం, ఈ యుద్ధంలో అమెరికా తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (CRS) చెబుతున్న దాని ప్రకారం.. అమెరికాకు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
యుద్ధంలో ఫైటర్ జెట్లు, డ్రోన్‌లతో సహా కనీసం 42 అమెరికా సైనిక విమానాలు ధ్వంసమైనట్లు సమాచారం. ఈ సైనిక చర్యకు ఇప్పటికే దాదాపుగా 29 బిలియన్ డాలర్లు ఖర్చు అయినట్లు పెంటగాన్ ప్రకటించింది.

ధ్వంసమైన యుద్ధ విమానాల్లో అమెరికా అత్యాధునిక F-15E స్ట్రైక్ ఈగిల్ ఫైటర్ జెట్‌లు నాలుగు, ఒక F-35A లైట్నింగ్ II ఫైటర్ విమానం, ఒక A-10 థండర్‌బోల్ట్ II గ్రౌండ్-ఎటాక్ విమానం, ఏడు KC-135 స్ట్రాటోట్యాంకర్ ఏరియల్ రీఫ్యూయలింగ్ విమానాలు, ఒక E-3 సెంటినల్ ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్-అండ్-కంట్రోల్ సిస్టమ్ (AWACS) విమానం, రెండు MC-130J కమాండో II స్పెషల్ ఆపరేషన్ విమానాలు, ఒక HH-60W జాలీ గ్రీన్ II వార్ రిసెర్చ్-రక్షణ హెలికాప్టర్, 24 MQ-9 రీపర్ డ్రోన్, ఒక MQ-4C ట్రైటాన్ డ్రోన్‌లు ఉన్నాయి.

ఇదిలా ఉంటే అమెరికా రక్షణ శాఖ ఇప్పటి వరకు యుద్ధ నష్టాలపై సమగ్ర అంచనాలను ప్రచురించలేదు. అమెరికా కాంగ్రెస్, కమిటీలు రక్షణశాఖ, అమెరికా సెంట్రల్ కమాండ్(CENTCOM) వార్తలు, నివేదికల ఆధారంగా నష్టాలను అంచనా వేసింది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధంలో మొదటి రోజు ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని హతమార్చింది. ఆ తర్వాత ఇరాన్ యూఎస్‌కు వ్యతిరేకంగా బలంగా దాడులు చేసింది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేసింది. ఇదే కాకుండా యూఏఈ, బహ్రైయిన్, ఖతార్, కువైట్ వంటి దేశాల్లోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను దెబ్బతీసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu