Dailyhunt
US-Iran War: ''మనం యుద్ధంలో ఉన్నాం''.. పైలట్‌ గల్లంతుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

US-Iran War: ''మనం యుద్ధంలో ఉన్నాం''.. పైలట్‌ గల్లంతుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

NTV Telugu 3 weeks ago

నం యుద్ధంలో ఉన్నామన్న సంగతి గుర్తుంచుకోవాలని అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. ప్రస్తుతం ఇరాన్.. అమెరికా యుద్ధ విమానాలు టార్గెట్ చేసుకుంది. నిన్న ఇరాన్ గగనతలంలో అమెరికా ఎఫ్-15ను కూల్చేసింది.

అయితే ఒకరు సేఫ్‌గా బయటపడగా.. ఇంకొకరి ఆచూకీ గల్లంతైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి:Iran-US War: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం.. హార్ముజ్ దగ్గర కూలిన మరో అమెరికా యుద్ధ విమానం

ఇది యుద్ధమని.. మన యుద్ధంలో ఉన్న సంగతి మరిచిపోవద్దని వ్యాఖ్యానించారు. ఇది ఇరాన్‌తో జరుగుతున్న చర్చలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. ప్రస్తుతం ఇరాన్ గగనతలంలో కూల్చివేయబడిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగుల్ యుద్ధ విమానం నుంచి బయటకు దూకిన సిబ్బందిలో ఒకరి కోసం అమెరికా, ఇజ్రాయెల్ దళాలు తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. అయితే ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ట్రంప్ నిరాకరించారు. ఇది సున్నితమైన సైనిక చర్య అని.. మీడియా దీనిపై అతిగా ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.

ఇదిలా ఉండగా ఇరాన్‌లోని హార్ముజ్ జలసంధి దగ్గర కూలిపోయిన మరో అమెరికా యుద్ధ విమానం నుంచి పైలట్‌ను సురక్షితంగా రక్షించినట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి:Kamal Haasan: ఎన్నికల వేళ కమల్‌హాసన్‌కు చేదు అనుభవం

ఇరాన్ విడుదల చేసిన చిత్రాలను విశ్లేషించిన అమెరికా మీడియా సంస్థలు.. అవి ఎఫ్-15 విమాన శకలాలేనని గుర్తించాయి. ఖుజెస్తాన్ ప్రావిన్స్ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రస్తుత ఘర్షణలో అమెరికా యుద్ధ విమానం కూల్చివేయబడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇదే సమయంలో యుద్ధ చర్యలతో పాటు ఇరాన్‌తో చర్చలు కూడా కొనసాగుతున్నప్పటికీ.. టెహ్రాన్ చర్చలకు దూరంగా ఉండటంతో శాంతి ప్రయత్నాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి.

ఇది కూడా చదవండి:Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu