Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vaibhav Sooryavanshi: ఎన్ని సెంచరీలు కొట్టినా వేస్ట్!! ఆ ఒక్క రికార్డును వైభవ్ దాటడం అసాధ్యం!

Vaibhav Sooryavanshi: ఎన్ని సెంచరీలు కొట్టినా వేస్ట్!! ఆ ఒక్క రికార్డును వైభవ్ దాటడం అసాధ్యం!

NTV Telugu 2 weeks ago

Vaibhav Sooryavanshi: టీమిండియా దిగ్గజ క్రికెటర్ అజింక్య రహానే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ వీడియో సందేశం ద్వారా తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.

రహానే భారత్ తరఫున మూడూ ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించినప్పటికీ, టెస్ట్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే, టీ20లలోనూ రహానే ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. నేటి తరం యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కూడా తన సుదీర్ఘ కెరీర్‌లో ఈ రికార్డును ఎప్పటికీ బద్దలు కొట్టలేరు. ఇక, ప్రస్తుతం భారత క్రికెట్‌లో వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగిపోతోంది. వైభవ్ మైదానంలోకి దిగితే ఏదో ఒక రికార్డు నమోదవాల్సిందే. అత్యంత పిన్న వయస్సులోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయడం నుంచి, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో వేగవంతమైన సెంచరీలు, హాఫ్ సెంచరీలు సాధించడం వరకు వైభవ్ చెలరేగిపోతున్నాడు. కానీ, రహానే పేరు మీద ఉన్న ఒకే ఒక్క టీ20 రికార్డును మాత్రం వైభవ్ తన జీవితంలో ఎప్పటికీ అధిగమించలేడు.

రహానే పేరు మీద ఉన్న ఆ ప్రత్యేక రికార్డు ఏమిటి?

టీ20 అంతర్జాతీయ అరంగేట్రం (డెబ్యూ) మ్యాచ్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అజింక్య రహానే రికార్డు సృష్టించాడు. 2011లో ఇంగ్లాండ్‌పై జరిగిన తన తొలి టీ20 మ్యాచ్‌లో రహానే 61 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. గత 15 ఏళ్లలో టీమిండియా తరఫున టీ20ల్లోకి అరంగేట్రం చేసిన ఏ ఆటగాడు కూడా ఈ స్కోరును దాటలేకపోయారు. మరోవైపు వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే, గతేడాది ఇంగ్లాండ్‌పైనే టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు వైభవ్. అయితే ఆ డెబ్యూ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. కాబట్టి 15 ఏళ్ల వైభవ్ తన రాబోయే కెరీర్‌లో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీలు, సెంచరీలు ఎన్ని సాధించినా.. అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రహానే నెలకొల్పిన రికార్డును బద్దలు గొట్టలేకపోయాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu