Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న

Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న

NTV Telugu 4 days ago

హేష్ బాబు వారణాసి సినిమా కోసం రాజమౌళి నాలుగేళ్ళు తీసుకున్నాడు. అయితే గతంతో పోలిస్తే ఈ సినిమా విషయంలో ఎందుకో కానీ జక్కన్న తెలుగు మీడియాను లైట్ తీసుకున్నాడు.

రాజమౌళి రీసెంట్ గా ఓ ఇంటర్నేషనల్ మీడియాతో వారణాసి విశేషాలు పంచుకున్నాడు. ఇప్పటివరకు 80% షూటింగ్ పూర్తయిందని అన్నాడు. కీ సీన్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు పూర్తయ్యాయని, చిన్న చిన్న సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని అన్నాడు. రాజమౌళి లాస్ట్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్ 2022 మార్చ్ లో రిలీజ్ అయింది.

అదే ఏడాది నుంచి వారణాసి కథపై కూర్చుంటే, బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ కావడానికి రెండేళ్లు పట్టింది. 2024 సెప్టెంబర్ లో వారణాసి టీం ఫోటో షూట్లో పాల్గొంది. 2025 ఫిబ్రవరిలో మహేష్, ప్రియాంక చోప్రాపై సీన్స్ చిత్రీకరణతో షూటింగ్ మొదలైంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి కానుంది.

సెప్టెంబర్ నుంచి రీరికార్డింగ్ స్టార్ట్ చేసి జనవరి నాటికి పూర్తి చేస్తానని కీరవాణి రీసెంట్ గా తెలిపాడు. సినిమా ఏప్రిల్ 7న థియేటర్స్ లోకి వస్తుంది. అయితే ఈ సినిమా లీక్స్ ముందు నుంచి రాజమౌళి హాలీవుడ్ మీడియాకి ఇస్తూ వచ్చాడు. హైదరాబాదులో ఒక గ్లింప్స్ రిలీజ్ చేసినా మీడియాను పెద్దగా పట్టించుకోలేదు. ఆ గ్లింప్స్ రిలీజ్ టైంలో టెన్షన్ తో ఉండడంతో అందరూ లైట్ తీసుకున్నా తరువాత జక్కన్న ఇంటర్నేషనల్ మీడియాకు మాత్రమే కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు కానీ తెలుగు మీడియా జోలికి రాలేదు. ఇది కాస్త ఇబ్బంది పెట్టే అంశమే ఆమె తెలుగు సినిమా మీడియా భావిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu