Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Veera Bhadrudu OTT: సూర్య 'వీర భద్రుడు' ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Veera Bhadrudu OTT: సూర్య 'వీర భద్రుడు' ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

NTV Telugu 1 week ago

టుడు – దర్శకుడు ఆర్‌జే బాలాజీ తెరకెక్కించిన 'వీరభద్రుడు' సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. విడుదల రోజున కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉదయం షోలు క్యాన్సిల్ అయినప్పటికీ, వన్స్ థియేటర్లలో బొమ్మ పడగానే సూర్య మాస్ రాంపేజ్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

ఆర్‌జే బాలాజీ మార్క్ స్క్రీన్‌ప్లే, సూర్య ఇంటెన్స్ యాక్టింగ్, చాలా ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకున్న సూర్య-త్రిషల వింటేజ్ కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

దీనికి తోడు యువ సంచలనం సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) థియేటర్లను ఊపేస్తోంది. మొదటి రోజే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా భారీ వసూళ్లను సాధించి సూర్య కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ అత్యున్నత నిర్మాణ విలువలతో నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు కైవసం చేసుకుంది.

లేటెస్ట్ సమాచారం ప్రకారం, 'వీరభద్రుడు' (కరుప్పు) చిత్రానికి సంబంధించిన పోస్ట్-థియేట్రికల్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకుంది. కాగా థియేటర్లలో విజయవంతంగా రన్ ముగిసిన తర్వాత(దాదాపు 4 నుండి 6 వారాల విండో తర్వాత) ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ప్రైమ్ విడియోలో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా థియేట్రికల్ రెస్పాన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉండటంతో ఓటీటీ లో కూడా డిజిటల్ ప్రీమియర్‌కు సాలిడ్ వ్యూస్ రావడం ఖాయామనిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu