Dailyhunt
VeeraBhadrudu : సూర్య 'కరుప్పు' తెలుగు టైటిల్ ఫిక్స్!

VeeraBhadrudu : సూర్య 'కరుప్పు' తెలుగు టైటిల్ ఫిక్స్!

NTV Telugu 3 weeks ago

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు ఆర్.జె. బాలాజీ (RJ Balaji) కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'కరుప్పు' (Karuppu). గ్రామీణ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది.

సూర్య మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. సూర్య సరసన స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) నటిస్తుండటంతో, 'మౌనం పేసియాదే' (తెలుగులో 'కాంచన గంగ') తర్వాత వీరిద్దరి కాంబో మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి అదిరిపోయే మాస్ ట్యూన్స్‌ను అందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది.

సాధారణంగా ఈ మధ్య కాలంలో తమిళ సినిమాలను అదే టైటిల్స్‌తో తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. కానీ, సూర్య సినిమా విషయంలో మాత్రం మేకర్స్ రూట్ మార్చారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ చిత్రానికి 'వీరభద్రుడు' (Veerabhadrudu) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగులో 'వీరభద్రుడు' అనే టైటిల్ పెట్టడం వల్ల మాస్ ఆడియన్స్‌కు సినిమా మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. మరి ఆర్‌.జె. బాలాజీ మార్క్ కామెడీ అండ్ మేకింగ్, సూర్య ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో నిలబెడతాయో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu