Nicholas Pooran - Mukul Chaudhary: గ్రౌండ్ లో తన బ్యాటింగ్ తో విద్వంసానికి పేరు పొందిన నికోలస్ పూరన్ ఐపీఎల్ 2026లో మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అసాధారణ హిట్టింగ్‌తో లక్నో సూపర్ జెయింట్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. ముఖ్యంగా అన్షుల్ కాంబోజ్ వేసిన ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది మ్యాచ్‌ను ముగించాడు. లక్నో జట్టు విజయానికి చివరి నాలుగు ఓవర్లలో 24 పరుగులు అవసరమైన సమయంలో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది.
అప్పటికే మిచెల్ మార్ష్ 38 బంతుల్లో 90 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అలాగే సమాద్ కూడా త్వరగా పెవిలియన్ చేరడంతో లక్నోపై ఒత్తిడి పెరిగింది. పూరన్ కూడా ఆ సమయానికి అంతగా లయలో కనిపించలేదు. అయితే అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌కు వచ్చిన వెంటనే మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. తన సహజ శైలిలో దూకుడుగా ఆడిన పూరన్ వరుసగా నాలుగు భారీ సిక్సర్లు బాది చెన్నైకు పరాజయాన్ని మూటగట్టాడు. కేవలం నాలుగు బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించి లక్నోకు 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందించాడు.
ఈ సమయంలో నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న ముకుల్ చౌదరి పూరన్ బ్యాటింగ్‌ను దగ్గర నుంచి ఆస్వాదించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్ లోనే పూరన్‌కు నమస్కరిస్తూ వంగి అభినందించిన ముకుల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతరం పూరన్ అతడిని హత్తుకున్నాడు. మరోవైపు ఈ ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్లేఆఫ్స్ అవకాశాలకు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటికే కఠిన పరిస్థితుల్లో ఉన్న చెన్నైకి ఈ పరాజయం మరింత ఒత్తిడిని తెచ్చింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి రేస్ లో లీనప్పటికీ, చెన్నై ఆశలను దెబ్బ తీసిందని చెప్పాలి.

