Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
VIJAY : తమిళనాడు సీఎం విజయ్ - భార్య సంగీతను కలిపేందుకు ప్రయత్నాలు

VIJAY : తమిళనాడు సీఎం విజయ్ - భార్య సంగీతను కలిపేందుకు ప్రయత్నాలు

NTV Telugu 19 hrs ago

త కొంతకాలంగా కోలీవుడ్ స్టార్ హీరో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, భార్య సంగీత విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన సమయంలో విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కింది.

తమిళ్ స్టార్ హీరోయిన్ త్రిష కారణంగానే విజయ్ – సంగీత విడాకులు తీసుకుంటున్నారని అక్కడి మీడియా కోడై కూసింది. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ పార్టీ గెలవడం సీఎం కావడం చక చక జరిగాయి. ఇక నెక్ట్స్ త్రిషని పెళ్లి కూడా చేసుకోబుతున్నాడని కూడా వార్తలు హల్ చల్ చేశాయి.

అయితే ఇప్పుడు వీటన్నింటికీ చెక్ పెడుతూ విజయ్, భార్య సంగీతను మళ్లీ కలపడానికి కుటుంబ సభ్యులు తెరవెనుక గట్టి ప్రయత్నాలే చేసినట్లు తాజా సమాచారం. విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న ఈ తరుణంలో వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లు పార్టీ ఇమేజ్‌పై ఎఫెక్ట్ పడకుండా ఉండేలా ఫ్యామిలీ మెంబర్స్ అలర్ట్ అయ్యారట. విజయ్, సంగీత మధ్య ఉన్న మనస్పర్థలను తొలగించి వారిద్దరినీ మళ్లీ ఒకటి చేయడానికి పెద్దలు చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరుపక్షాల మధ్య చర్చలు సఫలమయ్యాయని వీరిద్దరి మధ్య ఉన్న విబేధాలన్నీ దాదాపు పరిష్కారమయ్యాయని కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రేజీ స్టార్ జంటను తిరిగి ఒకటి చేయడంలో విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ అత్యంత కీలక పాత్ర పోషించారని తమిళనాడు పొలిటికల్ మరియు సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. తల్లిగా చొరవ తీసుకుని కోడలు సంగీతతో మాట్లాడి ఇద్దరినీ కూర్చోబెట్టి నచ్చజెప్పడంతో గొడవలు సద్దుమణిగినట్టు తెలుస్తోంది. విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్‌తో గతంలో ఉన్న విబేధాలు కూడా ఇప్పుడు సమసిపోవడానికి ఈ పరిణామాలే కారణమని టాక్. త్వరలోనే విజయ్, సంగీత ఇద్దరూ కలిసి పబ్లిక్‌గా కనిపించి ఈ రూమర్లకు పూర్తిగా ఎండ్ కార్డ్ వేయబోతున్నట్లు సమాచారం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu