Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vijay - Trisha: అసలు విజయ్ - త్రిషల మధ్య ఏముంది?

Vijay - Trisha: అసలు విజయ్ - త్రిషల మధ్య ఏముంది?

NTV Telugu 3 weeks ago

Vijay – Trisha Marriage: తమిళ చిత్ర పరిశ్రమలో దళపతి విజయ్ – త్రిష కృష్ణన్ జోడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘గిల్లి’, ‘తిరుపాచి’, ‘ఆది’, ‘కురువి’ వంటి సినిమాలతో ఈ జంట వెండితెరపై చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.

అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు కోలీవుడ్ నుంచి జాతీయ స్థాయి వరకు హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా విజయ్ భార్య సంగీత చేసిన సంచలన ఆరోపణలతో వీరి బంధం గురించి దేశ వ్యాప్తంగా సరికొత్త చర్చ మొదలైంది.

15 ఏళ్ల గ్యాప్.. ‘లియో’తో మళ్లీ
నిజానికి స్టార్ హీరో విజయ్ – హీరోయిన్ త్రిషల మధ్య అఫైర్ ఉందనే వార్తలు ఈనాటివి కావు. 2004లో ‘గిల్లి’ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. అయితే విజయ్ వివాహితుడు కావడంతో, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు 2008 తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం మానేశారు. సుమారు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2023లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘లియో’ సినిమా కోసం ఈ జోడి మళ్లీ కలిసి కెమెరా ముందుకు వచ్చింది. అప్పటి నుంచి వీరిద్దరూ పబ్లిక్ ఈవెంట్లలో, విజయ్ బర్త్‌డే వేడుకల్లో కలిసి కనిపిస్తుండటంతో రూమర్లు మళ్లీ షురూ అయ్యాయి.

భార్య ఆరోపణలు.. విడాకుల పిటిషన్
ఫిబ్రవరి 2026లో విజయ్ భార్య సంగీత సోర్నలింగం విడాకుల పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో విజయ్ ఒక స్టార్ హీరోయిన్‌తో అఫైర్ కొనసాగిస్తున్నారని ఆమె నేరుగా ఆరోపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది విజయ్-త్రిషల సంబంధాన్ని ధృవీకరిస్తున్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. త్రిష విషయానికి వస్తే.. ఈ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం 43 ఏళ్ల వయసులోనూ సింగిల్‌గానే ఉన్నారు. గతంలో 2015లో వరుణ్ మనియన్ అనే వ్యాపారవేత్తతో ఆమెకు నిశ్చితార్థం జరిగినా, నటనను వదిలేయాలని ఆయన కోరడంతో ఆ సంబంధాన్ని త్రిష తెంచుకున్నారని సమాచారం. తర్వాత 2025 అక్టోబర్‌లో ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చినా, ఆమె వాటిని ఖండించారు. ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో (TVK పార్టీ తరపున) విజయ దుందుభి మోగించారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడిన తర్వాత విజయ్ – త్రిషలు తమ బంధాన్ని అధికారికం వెల్లడించి, పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. విజయ్ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ఈ వార్తలపై ఇంతవరకు స్పందించలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu