Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vijay-Governor: కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న విజయ్

Vijay-Governor: కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న విజయ్

NTV Telugu 2 weeks ago

మిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్ సిద్ధపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాలు గెలుచుకుంది.

ఇప్పుడు కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఇదిలా ఉంటే బుధవారం మధ్యాహ్నం 3:30 గంటలకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్.. టీవీకే అధినేత విజయ్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. దీంతో గవర్నర్‌ను కలిసేందుకు టీవీకే కార్యాలయం నుంచి లోక్‌భవన్‌కు విజయ్ బయల్దేరారు. విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించనున్నారు.

ఇక గురువారం తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయ్‌తో పాటు 20 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం చెన్నై నెహ్రూ స్టేడియంలో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా హాజరవుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu