Dailyhunt
Vijay,Rashmika: అందుకే రష్మికను పెళ్లి చేసుకున్నా..  విజయ్ దేవరకొండ క్రేజీ కామెంట్స్!

Vijay,Rashmika: అందుకే రష్మికను పెళ్లి చేసుకున్నా.. విజయ్ దేవరకొండ క్రేజీ కామెంట్స్!

NTV Telugu 3 weeks ago

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల 'విరోష్' (Virosh) ప్రయాణం కొత్త పుంతలు తొక్కింది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట, ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌ వేదికగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటైన సంగతి తెలిసిందే.

పెళ్లి తర్వాత మొదటిసారి ఒక పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొన్న విజయ్, తన భార్య రష్మిక పుట్టినిల్లు అయిన కూర్గ్ (Coorg) గురించి చాలా గొప్పగా మాట్లాడారు.

'కూర్గ్ మహిళల సౌందర్యం అంటే నాకు ఎప్పటి నుండో ఒక ప్రత్యేకమైన ఇష్టం. ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అంటూ విజయ్ నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ మనసు గెలుచుకుంటున్నాయి. ఇక వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో ఒక ప్రభంజనం సృష్టించాయె తెలిసిందే. మార్చి 4న హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ రిసెప్షన్‌కు సినీ పరిశ్రమలోని ప్రముఖులందరూ హాజరై ఈ కొత్త జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం విజయ్ తన తదుపరి చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉండగా, రష్మిక కూడా ఇతర భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. పనిలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఒకరిపై ఒకరు ఉన్న ప్రేమాభిమానాలను ఇలా బహిరంగంగా పంచుకోవడం చూస్తుంటే, 'గీత గోవిందం' జంట రియల్ లైఫ్ లో కూడా సూపర్ హిట్ అని నిరూపించుకుంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu