Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వివాదంలో ఇరుక్కున్న వెబ్ సిరీస్

వివాదంలో ఇరుక్కున్న వెబ్ సిరీస్

NTV Telugu 6 years ago

వెబ్ సిరీస్ లను చూడటానికి ప్రేక్షకులే కాదు వెబ్ సిరీస్ లో నటించడానికి టాప్ సెలబ్రిటీస్ సైతం ఎంతో ఆతృతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్మార్ట్ ఫోన్.. స్మార్ట్ టీవీల్లో వెబ్ సిరీస్ లు వీక్షిస్తున్న యువతరాన్ని టీనేజర్లను టార్గెట్ చేస్తూ బూతు కంటెంట్ ని వండి వార్చేందుకు పలువురు దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తుండడం విమర్శలకు తావిస్తోంది . ఎప్పుడైతే బాలీవుడ్ సీనియర్ సెలబ్రిటీస్ తో పాటు యంగ్ బ్యూటి కియారా అద్వాని..హాట్ బ్యూటీ రాధికా ఆప్టే నటించిన లస్ట్ స్టోరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిందో అప్పటి నుంచి వెబ్ సిరీస్ కి ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ పెరిగింది.తాజాగా ఇదే కోవలో వచ్చిన వెబ్ సిరీస్ `రాస్ భరి`. స్వరా భాస్కర్ కథానాయిక.

అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ మీద నెగిటివ్ కామెంట్స్ తో పాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెప్పాలంటే ఈ వెబ్ సిరీస్ కంప్లీట్ గా యూత్ ని టార్గెట్ చేస్తూ బూతు కంటెంట్ తో రూపొందించారు.ఇప్పటివరకు అత్యల్ప రేటింగ్ దక్కించుకున్న చెత్త వెబ్ సిరీస్ గా రాస్ భరి గురించి చెప్పుకుంటున్నారు. స్వరా భాస్కర్ పోషించిన పాత్ర ఎంతో వివాదాస్పదం. తన చుట్టూ ఉన్న సంస్కృతి సంప్రదాయాల్ని మంటగలిపే వేశ్య తరహా పాత్రను స్వరా భాస్కర్ పోషించింది.సామాజిక ధృక్పథంతో ఆలోచిస్తే ఇలాంటి వెబ్ సిరీస్ తో ఎవరికి లాభం..ఎవరిని ఉద్దరించడానికి అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు .

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu