Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!

Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!

NTV Telugu 1 day ago

Vivo Y31s 5G Launched: వివో (Vivo) నుండి కొత్త మిడ్-రేంజ్ 5G స్మార్ట్‌ఫోన్ Vivo Y31s 5Gను మలేషియా మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో 6.74 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు.

ఈ స్క్రీన్ సూర్యరశ్మిలో కూడా స్పష్టమైన విజువల్స్ కనిపించేలా దీనిని “Sunlight Display”గా కంపెనీ ప్రచారం చేస్తోంది. వీడియోలు, గేమింగ్, సోషల్ మీడియా వినియోగంలో మెరుగైన అనుభూతిని అందించేలా డిస్‌ప్లేను రూపొందించారు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 4 Gen 2 చిప్‌సెట్‌ను అమర్చారు. 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఫోన్ అందుబాటులో ఉంది. రోజువారీ పనులతో పాటు మల్టీటాస్కింగ్, గేమింగ్ వంటి కార్యకలాపాలను సాఫీగా నిర్వహించే సామర్థ్యాన్ని ఈ ప్రాసెసర్ అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50MP ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. దీనికి 2MP బోకే సెన్సార్ అందించారు. దీంతో పోర్ట్రెయిట్ ఫోటోలు మరింత బాగా తీసుకోవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది.

ఈ ఫోన్‌లో 6500mAh సామర్థ్యం గల BlueVolt బ్యాటరీని అమర్చారు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. అలాగే 44W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. Vivo Y31s 5Gలో 5G కనెక్టివిటీతో పాటు NFC, USB Type-C పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. కాల్ రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే Hi-Fi ఆడియో సపోర్ట్ ఈ ఫోన్‌లో లేదు. దృఢత్వం పరంగా ఈ ఫోన్ IP68, IP69, IP69K+ రేటింగ్స్‌తో వస్తోంది. దీంతో దుమ్ము, నీటి నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది.

మలేషియాలో Vivo Y31s 5G ధర RM 1,499గా నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇది రూ.35,200 వరకు ఉంటుంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. బ్లాక్, పర్పుల్ రంగుల్లో లభించే ఈ స్మార్ట్‌ఫోన్‌ను వివో మలేషియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు భాగస్వామ్య రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu