Dailyhunt
Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..

Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..

NTV Telugu 1 week ago

Vizag Stock Market Scam: విశాఖపట్నంలో భారీ మోసం వెలుగు చూసింది.. అమాయక ప్రజల నుంచి పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడింది ఓ కుటుంబం… స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు కాజేశారు కేటుగాళ్లు..

స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ.. ప్రజలను నమ్మించి సుమారు రూ 6.5 కోట్లు డిపాజిట్ల రూపంలో వసూలు చేసినట్లు సమాచారం.. మీ తరఫున స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తామని నమ్మబలికి, వచ్చిన లాభాల్లో 50 శాతం వాటా ఇస్తామని పలువురుని ముంచేసారు మాయగాళ్లు… అయితే, గడువు తేదీ ముగిసినా లాభాలు ఇవ్వకపోగా, అసలు కూడా తిరిగి ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారు నిందితులు.. ఇక, న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు బాధితులు.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పీఎం పాలెం పోలీసులు.. మోసానికి పాల్పడిన సూర్య నారాయణమూర్తి, ఆయన భార్య త్రిపుర సుందరి, కుమారుడు ఎన్ భగవత్ వెంకట వినోద్, కోడలు గాయత్రిని అరెస్టు చేశారు పోలీసులు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu