Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Vrushakarma: 'వృషకర్మ' నుంచి సాలిడ్ అప్‌డేట్..

Vrushakarma: 'వృషకర్మ' నుంచి సాలిడ్ అప్‌డేట్..

NTV Telugu 1 week ago

'విరూపాక్ష' వంటి బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్ తర్వాత దర్శకుడు కార్తీక్ దండు, నాగచైతన్యతో కలిసి చేస్తున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ 'వృషకర్మ'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ హాంటింగ్ మ్యూజిక్ అందిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఇప్పటివరకు చూడని విధంగా ఒక సరికొత్త మైథికల్ ఎలిమెంట్స్‌తో కూడిన కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్ పనులకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని మేకర్స్ పంచుకున్నారు.

చిత్ర యూనిట్ వెల్లడించిన తాజా అప్‌డేట్ ప్రకారం.. రాజస్థాన్‌లోని చారిత్రాత్మక, అత్యంత అందమైన రాజభవనాల బ్యాక్‌డ్రాప్‌లో ప్లాన్ చేసిన ఒక కీలకమైన టాకి, యాక్షన్ షెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. కథలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ షెడ్యూల్ కోసం నాగచైతన్య, హీరోయిన్ మీనాక్షి చౌదరి.. విలన్ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాస్తవ పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు షూటింగ్ చివరి దశకు చేరుకోగా, మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా చాలా వేగంగా దూసుకుపోతున్నాయి. 'వృషకర్మ' అనేది ఒక విజువల్ వండర్‌గా రాబోతుండటంతో, సినిమాలో భారీ ఎత్తున CGI మరియు VFX (కంప్యూటర్ గ్రాఫిక్స్) వర్క్స్ జరుగుతున్నాయి. హాలీవుడ్ రేంజ్‌లో అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో ఈ థ్రిల్లర్‌ను ఆడియన్స్‌కు అందించాలని మేకర్స్ రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఈ భారీ గ్రాఫిక్స్ వర్క్స్ పూర్తయిన వెంటనే, అతి త్వరలోనే సినిమా అఫీషియల్ విడుదల తేదీని (Release Date) ప్రకటిస్తామని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu