Dailyhunt
Warangal: ఐనవోలులో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కుమార్తెలు అనుమానాస్పద మృతి..

Warangal: ఐనవోలులో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కుమార్తెలు అనుమానాస్పద మృతి..

NTV Telugu 1 week ago

రంగల్ జిల్లా ఐనవోలు మండలం పున్నేలులో తల్లి, ఇద్దరు కుమార్తెలు స్విమ్మింగ్ పూల్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్.

రిసార్ట్‌లోని స్విమ్మింగ్ పూల్ లో ఇద్దరు కూతుర్లు తల్లి మృతి పైన ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఇతర అధికారులతో కలిసి కేసు దర్యాప్తు పురోగతిని అడిగి తెలుసుకున్నారు సీపీ.

మరణాలకు గల కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించి, త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్ లోని సీసి కెమెరాల హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. భర్త హజారుద్దీన్ ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు. భర్త హజారుద్దీనే భార్య, ఇద్దరు పిల్లలను చంపాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu