Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్‌లో సీఏఏ స్టార్ట్..

West Bengal: అక్రమ బంగ్లాదేశీయుల బహిష్కరణ.. బెంగాల్‌లో సీఏఏ స్టార్ట్..

NTV Telugu 4 days ago

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో సీఎం సువేందు అధికారి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేయడానికి సిద్ధమైంది.

సీఏఏ కింద బంగ్లాదేశీ వలసదారుల్ని దేశం నుంచ బహిష్కరించే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు సీఎం సువేందు అధికారి ప్రకటించారు. గత ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకించిందని, ఈ చట్టాన్ని ఈరోజు( మే20) నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

సీఏఏ ప్రకారం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో మైనారిటీలుగా ఉన్న హిందువుల, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు భారత్ వచ్చినట్లయితే వారు పౌరసత్వానికి అర్హులు అవుతారు. సీఏఏ నిబంధన కింద లేని, వేరే దేశం నుంచి వచ్చిన ఇతర మతాల వారిని బీఎస్ఎఫ్‌కు అప్పగించి, దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు.

సీఎం సువేందు అధికారి టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలోని ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకించిందని, ఇప్పుడు మేము దీన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 31, 2024 వరకు భారత్ దేశానికి వచ్చినవారు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో మతపరమైన హింసను ఎదుర్కొని భారత్ వచ్చిన వారికి ఇది కటాఫ్ డేట్. దేశభద్రత కోసం సరిహద్దుల్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ చట్టాన్ని అమలు చేయాలని డీజీసీ, సీఎస్‌కు ఆదేశించినట్లు సీఎం చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu