Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
West Bengal: మదర్సాల్లో 'వందేమాతరం' తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..

West Bengal: మదర్సాల్లో 'వందేమాతరం' తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..

NTV Telugu 4 days ago

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మదర్సాల్లో ''వందేమాతరం'' పాడటాన్ని తప్పనిసరి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలను వెంటనే అమలులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర మదర్సా విద్యా డైరెక్టరేట్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. తరగతులు ప్రారంభానికి ముందు జరిగే కార్యక్రమాల్లో వందేమాతరాన్ని తప్పనిసరిగా గానం చేయాలని చెప్పింది. ఈ ఆదేశాలు ప్రభుత్వ మోడల్ మదర్సాలు, ప్రభుత్వ ఎయిడెడ్ మదర్సాలు, గుర్తింపు పొందిన అన్ని మదర్సాలకు వర్తిస్తాయి.

Snowfall: దేశమంతా ఎండలు భగభగలు.. లడఖ్‌లో మాత్రం భారీ హిమపాతం.. వీడియోలు వైరల్

ఈ నిర్ణయాన్ని మైనారిటీ వ్యవహారాల, మదర్సా విద్యాశాఖ మంత్రి ఖుదీరామ్ టుడు సమర్థించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వందేమాతరం తప్పనిసరిగా ఉందని, మదర్సాల్లో ఎందుకు ఉండొద్దని ప్రశ్నించారు. సంతాలీ భాషలో బోధన జరిగే పాఠశాలల్లో కూడా ఇది అమలులో ఉందని గుర్తుచేశారు. ఇటీవల బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వందేమాతరం గీతాన్ని తప్పనిసరి చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu