Dailyhunt
13వేల తో మొదలైంది.. 32 వేలకు చేరుకుంది.. ఈ సెక్యూరిటీ గార్డ్ చెప్పే పాఠాలు ఎందరికో కనువిప్పు

13వేల తో మొదలైంది.. 32 వేలకు చేరుకుంది.. ఈ సెక్యూరిటీ గార్డ్ చెప్పే పాఠాలు ఎందరికో కనువిప్పు

Oktelugu.com 1 week ago

Security Guard Success Story: చేసే ఉద్యోగం ఏదైనా సరే.. దానిని మనసుపెట్టి చేయాలి. వచ్చే జీతం ఎంతైనా సరే.. అది సమయానికి రావాలి. అప్పుడే అవసరాలు తీరుతాయి.

అలా కాకుండా చేసే ఉద్యోగం విషయంలో నిర్లక్ష్యం ఉంటే.. వచ్చే జీతం సమయానికి రాకపోతే.. అప్పుడు ఆ ఉద్యోగం చేసి కూడా దండగ. అందుకే ఉద్యోగం స్థిరంగా ఉండాలి.. వేతనం కష్టాలను తీర్చాలి అంటారు పెద్దలు. పెద్దల మాటను ఇతడు మైండ్ లో పెట్టుకున్నాడు అనుకుంటా.. అందుకే ఎందరికి ఆదర్శం లాంటి పని చేశాడు.

నేటి కాలంలో కిందిస్థాయి ఉద్యోగాలను చేయడానికి చాలామంది ఇబ్బందిగా భావిస్తున్నారు. అవసరమైతే ఖాళీగా ఉంటున్నారు కానీ.. ఆ ఉద్యోగాలు మాత్రం చేయడం లేదు. వేతనాలు తక్కువగా ఉంటాయనే అపోహ వల్ల అలా చేస్తున్నారు. కానీ ఉద్యోగం ఎలాంటిదైనా సరే భద్రత ఉంటే సరిపోతుంది. ఇదే విషయాన్ని ఈ వ్యక్తి నమ్మాడు. అందుకే చిన్న ఉద్యోగమైన సరే వదిలిపెట్టకుండా అందులో ప్రవేశించాడు. చివరికి ఈరోజు యావత్ దేశం మొత్తం తన వైపు చూసేలా చేశాడు.

అతడి పేరు బికినంది. చెన్నైలో ఉంటున్నాడు. ఓ పెద్ద కంపెనీ లో సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. 2021 లో అతడు తన సెక్యూరిటీ ఉద్యోగాన్ని మొదలుపెట్టాడు. ప్రారంభంలో అతడి వేతనం 13000.. ఆ తర్వాత మరసటి ఏడాది 15 వేలకు చేరింది. 2023 లో 18 వేలకు పెరిగింది. 2024లో 24 వేలకు చేరింది. 2025లో 25 వేలకు పెరిగింది. ఇప్పుడు అతని వేదనం ఏకంగా 32వేలకు పెరిగింది. సరిగ్గా 2021 నుంచి 26 సంవత్సరాలు మధ్య జీతం ఏకంగా 12 వేలు పెరిగింది.. దీనిని బట్టి అతడి కష్టాన్ని మనం అర్థం చేసుకోవచ్చు

నంది మొదటి నుంచి కూడా ఒకటే కంపెనీ వద్ద పనిచేస్తున్నాడు. నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. అవసరం ఉంటేనే సెలవులు తీసుకున్నాడు. కంపెనీ వద్ద తలవంచుకొని పనిచేశాడు. అందువల్ల మేనేజ్మెంట్ అతడికి ఈ స్థాయిలో వేతనాలు పెంచింది. సాధారణంగా ఉద్యోగాన్ని బానిసత్వం అని అంటారు. కానీ నందిలాంటివారు ఉద్యోగాన్ని ధర్మం లాగా భావిస్తారు. అందువల్లే ఈ స్థాయిలో ఎదిగారు. జస్ట్ 2021 నుంచి 26 వరకు అతని వేతనం 13 వేల నుంచి 32 వేల వరకు పెరిగింది అంటే అతడి కష్టాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com