Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆ దర్శకులు చిరంజీవి చెప్పిన చేంజెస్ చేయలేదా..అందుకే ఆ మూవీస్ తేడా కొట్టాయా..?

ఆ దర్శకులు చిరంజీవి చెప్పిన చేంజెస్ చేయలేదా..అందుకే ఆ మూవీస్ తేడా కొట్టాయా..?

Oktelugu.com 4 months ago

Chiranjeevi Director Changes: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పంతులు ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే మన స్టార్ హీరోలందరు పాన్ ఇండియా లో సినిమాలను చేస్తూ గొప్ప పేరు ను తెచ్చుకుంటున్నారు… మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ హీరో సైతం 70 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా ఇప్పటికీ వరుస సినిమాలను చేస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు.

ఇక సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఆయన ఇప్పుడున్న యంగ్ హీరోలకు ఏమాత్రం తీసుపోని రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండటం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట ఆయన చేయబోయే సినిమాలతో భారీ విజయాలను సాధిస్తే మాత్రం మరోసారి ఆయన పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మారుమ్రోగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు అతనికి అనుకున్న రేంజ్ లో సక్సెస్ ని సాధించి పెట్టడం లేదు. ఒక రకంగా విజయవంతంగా నిలుస్తున్నప్పటికి చిరంజీవిలోని పూర్తి నటుడిని బయటికి తీసే సినిమాలైతే రావడం లేదు.

చిరంజీవి చేసే ప్రతి సినిమాలో అతని ఇన్పుట్స్ కొన్ని ఉంటాయనే విషయం మనందరికి తెలిసిందే. ఎందుకంటే దర్శకుడు సరైన మార్గంలో వెళ్తున్నాడా లేదా అతను ఎలాంటి కథలు రెడీ చేశాడు. ఆ కథ ప్రస్తుతం ఉన్న ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా తనని జనాలు ఎలా చూడాలనుకుంటున్నారు అనే కొన్ని సందేహాల నుంచి చిరంజీవి కథలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాడు.

ఒక ఇద్దరు దర్శకులు మాత్రం చిరంజీవి చెప్పిన చేంజెస్ వినలేదట. అందువల్లే సినిమాలు తేడా కొట్టాయి అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. వాళ్ళలో డైరెక్టర్ సురేష్ కృష్ణగా మొదటి స్థానంలో ఉన్నాడు. ‘డాడీ’ సినిమా విషయంలో చిరంజీవి కొన్ని ఇన్పుట్స్ అయితే ఇచ్చాడట.

కానీ సురేష్ కృష్ణ వాటిని పట్టించుకోకపోవడం వల్ల సినిమా అనుకున్న రేంజ్ లో రాలేదని భారీ విజయాన్ని సాధించాల్సిన సినిమా కేవలం ఆవరేజ్ దగ్గరే ఆగిపోయిందని చాలామంది చెబుతూ ఉంటారు…ఇక రీసెంట్ గా కొరటాల శివ సైతం ‘ఆచార్య’ సినిమా విషయంలో చిరంజీవి మాట వినకపోవడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయింది అంటూ భారీ ఎత్తున ప్రచారం జరిగింది…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com