Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆఫ్ఘనిస్తాన్ తో టెస్ట్, వన్డే సిరీస్.. అతడికి విశ్రాంతి.. భారత జట్టు ఇదే..

ఆఫ్ఘనిస్తాన్ తో టెస్ట్, వన్డే సిరీస్.. అతడికి విశ్రాంతి.. భారత జట్టు ఇదే..

Oktelugu.com 6 days ago

India vs Afghanistan Test series squad: ఐపీఎల్ ముగిసిన తర్వాత.. టీమిండియా క్రికెటర్లకు కొద్ది రోజులు విశ్రాంతి లభిస్తుంది. ఆ తర్వాత వారు అంతర్జాతీయ క్రికెట్ లోకి దిగుతారు.

ఈనెల 31న ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే నెల 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో టీమిండియా ఒక టెస్ట్, 3 వన్డేల సిరీస్ ఆడుతుంది.

మన దేశం వేదికగా ఈ సిరీస్ నిర్వహిస్తారు. ఈ సీరియస్ కోసం మేనేజ్మెంట్ జటను ప్రకటించింది. విపరీతమైన వర్కులోడు బూమ్రా కు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చి. వన్డే జట్టులో రోహిత్, హార్దిక్ పాండ్యా ఆడతారు.. వారిని ఎంపిక చేసినప్పటికీ మేనేజ్మెంట్ ఒక మెలిక పెట్టింది. వారు పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధిస్తేనే తుది జట్టులో చోటు లభిస్తుంది.. అయితే మహమ్మద్ షమీ కి మేనేజ్మెంట్ అవకాశం కల్పించలేదు. అతని గురించి పెద్దగా చర్చించలేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ సందర్భంగా చెప్పడం విశేషం.

ఈ సిరీస్ లో హర్ష్ దుబే, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ తొలిసారిగా జట్టులో అవకాశాన్ని సాధించారు. టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియాకు గిల్ నాయకత్వం వహిస్తాడు. ఇతడితో పాటు జైస్వాల్ ఆడతాడు.. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడికల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, కులదీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, మానవ సుతార్, ప్రసిద్ధి కృష్ణ, బ్రార్, జూరెల్, హర్ష్ దుబే చూడు సంపాదించుకున్నారు.

3 వన్డేలు ఆడే జట్టు కోసం టీం ఇండియాకు గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అయ్యర్, రాహుల్, హర్ష్ దుబే, ప్రిన్స్ యాదవ్, ఇషాన్ కిషన్, అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కులదీప్ యాదవ్, ప్రసిద్ధి కృష్ణ వంటి వారు చోటు సంపాదించుకున్నారు.

తొలి టెస్ట్ జూన్ 6 నుంచి 10 వరకు చండీగఢ్ వేదికగా జరుగుతుంది.

తొలి వన్డే జూన్ 14న ధర్మశాల, రెండవ వన్డే జూన్ 17న లక్నో, మూడో వన్డే జూన్ 20న చెన్నైలో జరుగుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com