Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆరంభం మొదలైంది..టీమ్ ఇండియాను లీడ్ చేసేది తెలుగోడే..

ఆరంభం మొదలైంది..టీమ్ ఇండియాను లీడ్ చేసేది తెలుగోడే..

Oktelugu.com 1 week ago

Tilak Varma India A Captain: అప్పుడెప్పుడో అజహారుద్దీన్ పురుషుల క్రికెట్ జట్టుకు సారధిగా వ్యవహరించాడు. వివిఎస్ లక్ష్మణ్.. ఇంకా గొప్ప గొప్ప ప్లేయర్లు టీమిండియాలో ఆడినప్పటికీ..

సారధ్య బాధ్యతలు అందుకోలేకపోయారు. అయితే ఇన్నాళ్లకు నేను ఉన్నాను.. నేను విన్నాను అన్నట్టుగా వచ్చేసాడు. ఓ యువకుడు. అతని ఆట తీరు.. డైనమిక్ పర్సనాలిటీ బీసీసీఐ పెద్దలను కదిలించింది. చివరికి అతడికి సారధ్య బాధ్యతలను అప్పగించాల్సి వచ్చింది.

టీమిండియా యంగ్ సెన్సేషన్ తిలక్ వర్మకు ప్రమోషన్ లభించింది. టీమిండియా కెప్టెన్ గా అతడికి ఉన్నతి సాధ్యమైంది. శ్రీలంక జట్టుతో వచ్చే నెలలో జరిగే ట్రై సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఇందులో భారత ఏ జట్టుకు నాయకుడిగా తిలక్ వర్మ వ్యవహరిస్తాడు. భారత ఏ జట్టుతో పాటు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఈ టోర్నీలో ఆడుతాయి. పరిమిత ఓవర్ల ట్రై సిరీస్ అనంతరం ఇండియా ఏ జట్టు, శ్రీలంకయ్య జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ మొత్తం పూర్తయిన తర్వాత జాతీయ జట్టును ప్రకటిస్తారు. వైట్ బాల్ మ్యాచ్లు దంబుల్లాలో జరుగుతాయి. రెడ్ బాల్ మ్యాచ్ లు గాలే లో జరుగుతాయి..

ట్రై సిరీస్ కోసం భారత ఏ జట్టుకు నాయకుడిగా తిలక్ వర్మ వ్యవహరిస్తాడు. ఐపీఎల్ సంచలన ఆటగాళ్లు ప్రియాంష్ ఆర్య, వైభవ్ సూర్య వంశీ, రియాన్ పరాగ్, ఆయుష్ బదోని , నిశాంత్ సింధు, హార్ష్ దూబే, సూర్యాన్ష్ షెడ్జ్, ప్రబ్ సిమ్రాన్ సింగ్, కుమార్ కుషాగ్ర, విప్ రాజ్ సింగ్, యాష్ వీర్, విప్ రాజ్, అర్షద్ ఖాన్ వంటి ప్లేయర్లకు బీసీసీఐ జట్టులో చోటు కల్పించింది.

ఇదీ షెడ్యూల్

జూన్ 9, మంగళవారం నాడు శ్రీలంక ఏ జట్టుతో భారత ఏ జట్టు పోటీపడుతుంది.

జూన్ 11 గురువారం ఇండియా ఏ జట్టుతో ఆఫ్గనిస్తాన్ ఏ జట్టు పోటీపడుతుంది.

జూన్ 13 శనివారం ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో, శ్రీలంక ఏ జట్టు పోటీపడుతుంది.

జూన్ 15 సోమవారం ఇండియా ఏ జట్టుతో, శ్రీలంక ఏ జట్టు పోటీ పడుతుంది.

జూన్ 17 బుధవారం ఇండియా ఏజట్టుతో ఆఫ్గనిస్తాన్ ఏ జట్టు పోటీపడుతుంది.

జూన్ 19 శుక్రవారం నాడు ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టు, శ్రీలంక ఏ జట్టు పోటీ పడతాయి.

జుట్టు 21 ఆదివారం రోజు ఫైనల్ పోటీ జరుగుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com