Dailyhunt
అమరావతికి చట్టబద్ధత : '2024 జూన్ 2' నోటిఫై ఎందుకంటే

అమరావతికి చట్టబద్ధత : '2024 జూన్ 2' నోటిఫై ఎందుకంటే

Oktelugu.com 3 weeks ago

Amaravati Capital 2024 Notification: ఏపీ( Andhra Pradesh) ప్రజల ఆకాంక్ష నెరవేరింది. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత లభించింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ..

ఏపీ పునర్విభజన చట్టం 2014 సవరిస్తూ తీసుకొచ్చిన బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయగా.. న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 జూన్ రెండు నుంచి ఏపీ రాజధానిగా అమరావతిని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. అమరావతి గెజిట్ నోటిఫికేషన్ లో 2024 జూన్ రెండు నుంచి రాజధానిగా గుర్తించినట్టు పేర్కొనడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అదే తేదీ నుంచి ఎందుకు అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

* పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా
2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఉమ్మడి ఏపీకి హైదరాబాద్( Hyderabad) రాజధానిగా ఉండేది. అయితే విభజన తర్వాత కూడా అంటే 2014 నుంచి 2024 వరకు పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఉంచారు. అయితే ఆ గడువు 2024 జూన్ 2 తో ముగిసింది. ఈ క్రమంలోనే 2024 జూన్ రెండు నుంచి అమరావతి ఏకైక రాజధానిగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.

* రెండు కారణాలతో..
అయితే ఈ నిర్ణయం వెనుక రెండు కారణాలు ఉన్నాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదుకు ఇచ్చిన గడువు ముగియడం ఒకటి అయితే.. మూడు రాజధానుల ఎపిసోడ్ కు చెక్ పెడుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయింది. రాబోయే రోజుల్లో ఎలాంటి వివాదాలు లేకుండా చట్ట సవరణపై స్పష్టత ఇచ్చారు. ఒకవేళ భవిష్యత్తులో రాజధాని అమరావతి ఏవైనా మార్పులు, చేర్పులు చేయాలంటే పార్లమెంటుకు మాత్రమే అధికారం కట్టబెట్టారు. శాసనసభలో సవరణ చేసి మార్పు చేస్తామంటే కుదిరే పని కాదు.

* అసలు విషయం తెలియక..
అయితే అంతా మూడు రాజధానులకు ( three capitals )చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే అమరావతికి చట్టబద్ధత కల్పించారని భావించారు. కానీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కు ఉన్న గడువు ముగిడంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారన్న విషయం చాలామందికి తెలియదు. ఎంతవరకు మూడు రాజధానులకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే.. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనుకున్నారు. కానీ 2024 జూన్ 2 తో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగిసిందని కేవలం కొద్ది మందికి మాత్రమే తెలుసు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com