American express : ప్రపంచంలో ఎన్నో క్రెడిట్ కార్డులు ఉన్నాయి. కానీ కొన్ని కార్డులు కేవలం చెల్లింపులకు మాత్రమే ఉపయోగపడకుండా.. ప్రీమియం సేవలు..
ప్రయాణ సౌకర్యాలు.. రివార్డులు.. ప్రత్యేక అనుభవాలకు చిహ్నాలుగా ఉంటాయి. అలాంటి సంస్థల్లో ప్రముఖమైనది American express (amex).
ఒకప్పుడు వస్తువులను రవాణా చేసే సంస్థగా ప్రారంభమైన ఈ కంపెనీ.. నేడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన చెల్లింపుల సంస్థగా ఎలా ఎదిగింది.. సాధారణ క్రెడిట్ కార్డులకు, amex కార్డులకు మధ్య ఉన్న తేడాలేమిటి? బ్లాక్ కార్డుకు అంత ప్రత్యేకత ఎందుకు.. ఈ విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం
ప్రయాణం ఎక్కడ మొదలైంది..
1850 లో American express జర్నీ మొదలయింది. Henry wales, William ji Fargo Jaan butterfield ఈ సంస్థ ప్రారంభానికి అంకురార్పణ చేశారు. ఆ రోజుల్లో ఇది కేవలం క్రెడిట్ కార్డుల సంస్థ కాదు. విలువైన వస్తువులను.. పార్సిల్లను.. సరుకులను సురక్షితంగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేయడం దీని ప్రధాన వ్యాపారం. నాటి రోజుల్లో బ్యాంకింగ్.. రవాణా సదుపాయాలు ఇప్పటి మాదిరిగా డెవలప్ కాలేదు. అలాంటి పరిస్థితుల్లో వ్యాపారులకు.. ప్రయాణికులకు నమ్మకమైన సేవలు అందించడం ద్వారా ఈ కంపెనీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.
వస్తువుల రవాణా నుంచి
American express తన వ్యాపారాన్ని రవాణా కే పరిమితం చేయలేదు. క్రమంగా ఆర్థిక సేవలు.. ప్రయాణ సేవలోకి అడుగు పెట్టింది.. 1891లో విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఉపయోగపడే ట్రావెలర్స్ చెక్కులను ప్రవేశపెట్టింది. 20వ శతాబ్దంలో ట్రావెల్ టికెట్లను..ట్రావెల్ గైడ్.. ఇతర ట్రావెల్స్ సేవలను విస్తరించింది.
1958లో అమెరికా, కెనడా దేశాలలో తన తొలి చార్ట్ కార్డును అందుబాటులో తీసుకొచ్చింది. నగదు లేకుండా చెల్లింపులు చేసే విధానానికి కొత్త ఊపు ఇచ్చింది. ఇక్కడే కంపెనీ భవిష్యత్తు పూర్తిగా మారిపోయింది. వస్తువులను ఒకచోటి నుంచి మరొక చోటుకు తీసుకెళ్లే సంస్థగా వ్యాపారం మొదలుపెట్టి.. ప్రజలు డబ్బులను ఏ విధంగా ఖర్చు చేస్తారు.. ఎలా చెల్లిస్తారు అనే విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది.
American express కార్డు వల్ల ఉపయోగాలు ఏంటంటే..
ఎయిర్పోర్ట్ లాంజ్ సదుపాయాలు
అర్హత కలిగిన కార్డుల ద్వారా ఎంపిక చేసుకున్న దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలలో లాంజ్ సదుపాయాలను పొందవచ్చు. అలాగే, సందర్శనల సంఖ్య, నిబంధనలు వంటి వాటివి కార్డు ఆధారంగా మారుతాయి.
హోటళ్లు, ప్రయాణ ప్రయోజనాలు
కొన్ని ప్రీమియం కార్డుల ద్వారా హోటల్ మెంబర్షిప్ లు, ప్రయాణ ఆఫర్లు, ఎంపిక చేసిన బుకింగ్లపై ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి.
రివార్డు పాయింట్లు
కార్డుతో చేసే అర్హత కలిగిన కొనుగోళ్లపై పాయింట్లు పొందవచ్చు. వాటిని నిబంధనల ప్రకారం ప్రయాణం లేదా షాపింగ్ లేదా ఇతర రివార్డుల కోసం ఉపయోగించవచ్చు.
ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ సేవలు
ఎంపిక చేసిన కార్డులలో రెస్టారెంట్ ఆఫర్లు, సినిమా ఓచర్లు, సదుపాయాలు, ఇతర సేవలు పొందవచ్చు.
American express గురించి చెబుతున్నప్పుడు చాలామందికి గుర్తుకు వచ్చే పేరు Centurion card.. దీనిని సాధారణంగా బ్లాక్ కార్డ్ అని పిలుస్తుంటారు. ఇది సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే కార్డు కాదు. American express ఎంపిక చేసిన అర్హులైన కస్టమర్లకు ఆహ్వానం ఆధారంగా అందించే కార్డుగా ఇది ప్రసిద్ధి చెందింది. ప్రీమియం ప్రయాణం, వ్యక్తిగత సేవలు, లైఫ్ స్టైల్ ప్రయోజనాలతో దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. అయితే దీని అర్హతలు, ఖర్చుల నిబంధనలు, ఫీజులు వంటి వాటిని దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఈ కార్డు ఉన్నత మాత్రాన ప్రపంచంలో ఎక్కడైనా ఏ వస్తువైనా పరిమిత లేకుండా కొనవచ్చు అని అర్థం కాదు లావాదేవీల ఆమోదం.. ఖర్చు పరిమితులు.. కార్డు నిబంధనలు వంటివి వర్తిస్తాయి.
మనదేశంలో ఎలాగంటే
American express మనదేశంలో వివిధ రకాల క్రెడిట్, చార్ట్ కార్డులను అందించింది. వీటిలో ప్లాటినం, ప్లాటినం రిజర్వ్, ప్లాటినం ట్రావెల్, membership rewards, smart earn వంటి కార్డు ఉత్పత్తులున్నాయి. ప్రతి కార్డు ప్రయోజనాలు.. ఫీజులు.. అర్హతలు రకరకాలుగా ఉంటాయి.
కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే amex అన్ని దుకాణాలలో తప్పనిసరిగా పని చేస్తుందని అనుకోవద్దు. ప్రతి వ్యాపారి American express అంగీకరించకపోవచ్చు. కార్డు తీసుకునే ముందు వార్షిక రుసుము.. నిజంగా ఉపయోగపడే ప్రయోజనాలు. రివార్డుల విలువ.. విదేశీ లావాదేవీల చార్జీలను పరిశీలించాలి.
Amex card ద్వారా కంపెనీ డబ్బు ఎలా సంపాదిస్తుంది
క్రెడిట్ కార్డు వ్యాపారం వెనుక ఒక ఆసక్తికరమైన నమూనా ఉంది. కార్డు చెల్లింపులు స్వీకరించే వ్యాపారుల నుంచి ఒప్పందాల ప్రకారం ఫీజులు రావచ్చు. కొన్ని కార్డులకు జాయినింగ్ ఫీజు.. వార్షిక రుసుం ఉంటాయి. వర్తించే కార్డు నిబంధనలను బట్టి చెల్లింపులు ఆలస్యం కావడం లేదా బగాయిలపై వడ్డీ, ఇతర చార్జీలను విధిస్తారు. ఇలా కార్డు జారీ, చెల్లింపుల నెట్వర్క్, వ్యాపార సేవలు, ఆర్థిక ఉత్పత్తుల ద్వారా కంపెనీ ఆదాయాన్ని సంపాదిస్తుంది.
- తరచుగా విమాన ప్రయాణం చేసే వారికి లాంజ్, ట్రావెల్ ప్రయోజనం లభిస్తాయి.
- షాపింగ్ ఎక్కువ చేసే వారికి రివార్డ్ పాయింట్లు, ఆఫర్లు లభిస్తాయి.
- ప్రీమియం హోటళ్లలో ఉండే వారికి హోటల్, డైనింగ్ ప్రయోజనాలు లభిస్తాయి.

