Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికాలో భారతీయులకు ఎంతకాలం ఈ జాతి వివక్ష.. వైరల్ వీడియో

అమెరికాలో భారతీయులకు ఎంతకాలం ఈ జాతి వివక్ష.. వైరల్ వీడియో

Oktelugu.com 0 months ago

Indian Discrimination In America: గూగుల్ సీఈఓ గా సుందర్ పిచాయ్ ఉన్నాడు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల ఉన్నాడు. ఇంకా అనేక మంది భారతీయులు అమెరికా దేశంలో పేరు పొందిన కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారు.

చివరికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్య కూడా భారతీయ మూలాలు ఉన్న మహిళ. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా ప్రస్థానంలో భారతీయులు చాలామంది ఉన్నారు. ఇకముందు కూడా ఉంటారు.

అమెరికా ఆర్థిక అభివృద్ధిలో.. భారతీయులు విశేషమైన కృషి చేస్తున్నారు. కొంతమంది భారతీయులు అక్కడే స్థిరపడి అమెరికన్ పౌరులుగా కొనసాగుతున్నారు. అమెరికా రాజకీయాలలో కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు.. ఇంతటి ఖ్యాతి ఉన్న భారతీయులను అమెరికా దేశస్తులు చులకనగా చూస్తున్నారు. దారుణంగా మాట్లాడుతున్నారు. భారతీయులతో పోటీ పడలేక.. భారతీయుల మాదిరిగా కష్టపడి పని చేయలేక.. చివరికి ద్వేషాన్ని నమ్ముకున్నారు. ఒళ్ళు వంచి పని చేయడం చేతకాక.. నోటికి పని చెబుతున్నారు. అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. గతంలో ఈ సంఘటనలు అనేకం జరిగాయి. భారతీయుల మీద అమెరికా దేశస్థులు వ్యవహరిస్తున్న తీరు పట్ల విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ అమెరికా దేశస్థులు తీరు మార్చుకోవడం లేదు.

తాజాగా అమెరికాలో ఒక దారుణం జరిగింది. భారతదేశానికి చెందిన ఇద్దరు రోడ్డు మీద నిలబడి ఉన్నారు. అక్కడికి అమెరికా దేశానికి చెందిన ఒక వ్యక్తి వచ్చాడు. “మీరు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారు.. మీరు భారతీయులా” ఇలా అనేక రకాలుగా ప్రశ్నలు అడిగాడు.. దానికి వారు పెద్దగా సమాధానం చెప్పలేదు..”మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు.. మీకు ఇండియా అంటే ఇష్టమైతే అక్కడే ఉండాలి కదా. ఇక్కడ దాకా రావడం ఎందుకు.. మీ దేశానికి వెళ్లిపోండి..”అంటూ తీవ్ర స్వరంతో మాట్లాడాడు. అంతేకాదు పరుష పదజాలాన్ని ఉపయోగించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆ భారతీయ కుటుంబం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అమెరికాలో భారతీయులకు భద్రత అనేది ఎండమావిలాగా మారుతుంది. అమెరికాలో పేరుపొందిన కంపెనీలకు భారతీయులు నేతృత్వం వహిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కష్టపడి పని చేసే భారతీయులకు అక్కడ ఆ స్థాయిలో గౌరవం లభించడం లేదు. పైగా వేధింపులు పెరిగిపోతున్నాయి. పని ప్రదేశాలలో భారతీయులు నరకం చూస్తున్నారు. కొన్ని సందర్భాలలో అమెరికా దేశస్తులు భారతీయులను అంతం కూడా చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో భౌతికపరమైన దాడులకు కూడా పాల్పడుతున్నారు..కష్టపడి పని చేయడమే భారతీయులకు శాపంగా మారింది.. అందువల్లే అమెరికా దేశస్తులు ఈ స్థాయిలో దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా భారతీయుల మీద అమెరికా పౌరులు విపరీతమైన ద్వేషంతో ఉంటున్నారు.. ఇటీవల అమెరికా దేశస్థులపై భారతీయులు అక్కడి పోలీసులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. అయితే అక్కడి పోలీసులు అంతగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com