Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అనిల్ రావిపూడి కొత్త మూవీలో నటించనున్న రాజమౌళి... క్యారెక్టర్ ఏంటి ఇంత కామెడీగా ఉంది...

అనిల్ రావిపూడి కొత్త మూవీలో నటించనున్న రాజమౌళి... క్యారెక్టర్ ఏంటి ఇంత కామెడీగా ఉంది...

Oktelugu.com 3 months ago

Anil Ravipudi And SS Rajamouli: కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. రాజమౌళి తర్వాత వరుసగా సక్సెస్ లను సాధిస్తున్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఇక అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇక ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఇక ప్రస్తుతం ఆయన వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలుగా పెట్టి ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ హీరోలిద్దరిని ఎలా వాడుకోబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో రాజమౌళిని సైతం భాగం చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో ఉందట. ఆ పాత్ర రాజమౌళి చేస్తే బాగుంటుందని అనిల్ రావిపూడి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికి రాజమౌళి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే రాజమౌళిని కలిసి ఆ క్యారెక్టర్ గురించి చర్చించిన అనిల్ తొందరలోనే రాజమౌళి ఈ మూవీ చేస్తున్నాడు అంటూ ఒక అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కాబట్టి అనిల్ సైతం సినిమా షూటింగ్ మొత్తాన్ని అయిపోగొట్టిన తర్వాత చివరిలో రాజమౌళి పోర్షన్ షూట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడడట.

ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పటికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తన పరిధిని విస్తరించుకున్నాడు. కాబట్టి రాజమౌళి అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ అయితే ఉంటుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఆయనకు సరిపడా ఒక మంచి క్యారెక్టర్ అయితే అనిల్ రావిపూడి డిజైన్ చేశారట.

ఆయన పాత్ర సినిమాలో 5 నిమిషాల పాటు కనిపిస్తుందని కూడా అనిల్ రావిపూడి తన సన్నిహిత వర్గాల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి మంచి నటుడు కాబట్టి అనిల్ తన చేత కామెడీ చేయించాలని డిసైడ్ అయ్యాడట. రాజమౌళి కామెడీ ఎలా పండిస్తాడు అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com