Dailyhunt
అంతటి ఈడెన్ గార్డెన్స్ ను క్షణంలోనే కప్పేశారు.. గ్రౌండ్ మెన్ కృషికి హాట్సాఫ్

అంతటి ఈడెన్ గార్డెన్స్ ను క్షణంలోనే కప్పేశారు.. గ్రౌండ్ మెన్ కృషికి హాట్సాఫ్

Oktelugu.com 3 weeks ago

Eden Gardens Ground Staff Efforts IPL Rain Match: ఐపీఎల్ ప్రారంభానికి ముందు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒక కీలక సమావేశం నిర్వహించాడు. ఆ కార్యక్రమానికి ముంబై యాజమాన్యం హాజరు కాలేదు.

ముంబై ప్లేయర్లు కూడా హాజరు కాలేదు. వచ్చింది మొత్తం గ్రౌండ్ మెన్. వారంతా కూడా ముంబై మైదానంలో పనిచేస్తుంటారు. వారికి చెల్లించే వేతనాలు కూడా అంతంతమాత్రంగానే ఉంటాయి. వారి కృషిని చూసిన హార్దిక్ పాండ్యా.. ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడాడు. వారికి మంచి విందు ఇచ్చాడు. ఆ తర్వాత ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున చెక్కులు అందజేశాడు. హార్థిక్ పాండ్యా చేసిన ఈ పని చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకొంతమందికి ఆనందాన్ని కలిగించింది.

హార్దిక్ పాండ్యా గ్రౌండ్ మెన్ కు ఆ స్థాయిలో ప్రోత్సాహం ఇవ్వడం పట్ల రకరకాల విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. సాధారణంగా మైదానంలో ఆటగాళ్లు ఆడేందుకు వస్తున్నప్పుడు సకల సౌకర్యాలు ఉంటాయి.. అవన్నీ సిద్ధం చేయాలంటే మామూలు విషయం కాదు. గ్రాస్ పరచడం నుంచి మొదలు పెడితే నీటిని చల్లడం వరకు ప్రతి విషయంలో గ్రౌండ్ మెన్ కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఒకటికి 1000 సార్లు పరిశీలిస్తుంటారు. వర్షం కురిసినప్పుడు గ్రౌండ్ మెన్ పడే ఇబ్బంది మామూలుగా ఉండదు. కాలంతో వేగంగా వారు పనిచేస్తుంటారు. కొన్ని సందర్భాలలో గాయాల బారిన కూడా పడుతుంటారు. వర్షం కురిసినప్పుడు.. డ్రైనేజీ నీళ్లను బయటికి పంపించడానికి గ్రౌండ్ మెన్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు.

ఐపీఎల్ లో భాగంగా సోమవారం పంజాబ్, కోల్ కతా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. వర్షం విపరీతంగా కురవడంతో మ్యాచ్ నిర్వహించడానికి అవకాశం కలగలేదు. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారకుండా ఉండడానికి పరదాలు కప్పారు. అంతటితో ఆగలేదు.. గ్రౌండ్ మొత్తాన్ని పరదాలతో నింపేశారు. కాకపోతే వర్షం తీవ్రత అధికంగా ఉండడం.. ఆకాశంలో మేఘాలు విస్తారంగా ఉండడంతో గ్రౌండ్ మెన్ పడిన ప్రయాసకు ఉపయోగం లేకుండా పోయింది.

గ్రౌండ్ మెన్ పడిన కష్టాన్ని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు కొనియాడుతున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వారు మైదానాన్ని కాపాడేందుకు ప్రయత్నించారని.. కాకపోతే వర్షం తీవ్రత అధికంగా ఉండడంవల్ల వారు పడిన శ్రమ వృధా అయిందని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. గ్రౌండ్ మెన్ చేసిన కృషికి సెల్యూట్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com