Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Anupama Parameswaran : ధృవ్ విక్రమ్ తో బ్రేకప్ పై మొదటిసారి పబ్లిక్ ఈవెంట్ లో స్పందించిన అనుపమ పరమేశ్వరన్.. వీడియో వైరల్..

Anupama Parameswaran : ధృవ్ విక్రమ్ తో బ్రేకప్ పై మొదటిసారి పబ్లిక్ ఈవెంట్ లో స్పందించిన అనుపమ పరమేశ్వరన్.. వీడియో వైరల్..

Oktelugu.com 1 week ago

Anupama Parameswaran : తెలుగు , తమిళం , మలయాళం అని సంబంధం లేకుండా , అన్ని భాషల్లోనూ సరిసమానమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ముఖ్యంగా మన తెలుగు యువత అయితే అనుపమ పరమేశ్వరన్ అంటే పది చచ్చిపోతుంటారు.

ఆమె రింగుల చుట్టూ అంటే మన తెలుగు యువత కి ఎంతో ఇష్టం. ఈమెని పెళ్లి చేసుకోబోయే అదృష్టవంతుడు ఎవరో అని కామెంట్స్ కూడా చేసేవారు. అయితే ఈమె ప్రముఖ తమిళ యంగ్ హీరో, విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ తో ప్రేమలో ఉంది అనే వార్త తెలుసుకొని కోట్లాది మంది కుర్రాళ్ళు అసూయ పడ్డారు. అయితే ఇప్పుడు ఆమె అతనితో బ్రేకప్ చేసుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో బ్రేకప్ గురించి అనుపమ అనేక పోస్టులు కూడా పరోక్షంగా పెట్టింది. ఆ పోస్టులు చూసిన తర్వాత , పాపం అనుపమ ఇన్ని రోజులు పంజరం లో బంధించబడిన చిలుక లాగా జీవించిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఆమె ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని రోజుల క్రితం పెట్టిన పోస్టులు ఎలా ఉన్నాయంటే, ‘ఇక మీదట నేను ఎవరి అనుమతి తీసుకొనవసరం లేదు , నా పోస్టులు నేను పెట్టుకోవచ్చు , వెళ్లాలని అనుకున్న చోటకు వెళ్లొచ్చు , నా జీవితం పై అజమాయిషీ చేసే అవకాశం మరొకరికి ఇప్పుడు లేకుండా పోయింది. ఇప్పుడు నేను చాలా స్వేచ్ఛగా జీవిసున్నాను’ అంటూ బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది. నేరుగా ఆమె ధృవ్ విక్రమ్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు కానీ , ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ధృవ్ విక్రమ్ ని ‘అన్ ఫాలో’ కొట్టడం , ఆ వెంటనే ఇలాంటి పోస్టులు పెట్టడం చూస్తుంటే , కచ్చితంగా ఇది ధృవ్ ని ఉద్దేశించి పెట్టినవే అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ధృవ్ తో బ్రేకప్ వ్యవహారం నేషనల్ లెవెల్ మీడియా లో కూడా బాగా వైరల్ అయ్యింది.

అంత వైరల్ అయ్యినప్పుడు ఒకవేళ నిజంగానే ధృవ్ విక్రమ్ కి ఎలాంటి సంబంధం లేదని అనుకుంటే , కచ్చితంగా అనుపమ క్లారిటీ ఇచ్చేది. కానీ ఆమె ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. దీన్ని బట్టీ అర్థం చేసుకోవచ్చు ఇదంతా నిజమే అనేది. ఇకపోతే నేడు ఆమె హీరోయిన్ గా నటించిన ‘క్రేజీ కళ్యాణం’ మూవీ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఆమె బ్రేకప్ గురించి పరోక్షంగా మాట్లాడుతూ ‘నేను ప్రస్తుతం చాలా సంతోషంగా, క్షేమంగా ఉన్నాను. ఈ ఏడాదిలో నేను జీవితం లోనే అత్యంత కఠినమైన సంఘటనలను ఎదురుకున్నాను అనేది వాస్తవమే. కానీ ఇప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటున్నాను. ఈ మానసిక ప్రశాంతత ముందే వస్తుందని తెలిసి ఉండుంటే ఎంత బాగుండేదో’ అంటూ చెప్పుకొచ్చింది అనుపమ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com