Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Apple iPhone 18 pro : ఐఫోన్ లవర్స్ కు షాక్ ఇచ్చిన ఆపిల్..

Apple iPhone 18 pro : ఐఫోన్ లవర్స్ కు షాక్ ఇచ్చిన ఆపిల్..

Oktelugu.com 1 week ago

Apple iPhone 18 pro : స్మార్ట్ ప్రపంచంలో ఎన్నో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మరెన్నో కంపెనీలు తమ ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. కానీ ఆపిల్ కంపెనీకి ఉన్న రేంజ్ వేరు.

ఆపిల్ కంపెనీ ప్రతి ఏడాది తన ఐఫోన్ రేంజ్ లో కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది.

ప్రీమియం ఫోన్లను కోరుకునే వారికి ఆపిల్ కంపెనీ తయారు చేసే ఉత్పత్తులు అత్యుత్తమమైన ఎంపిక. ప్రతి ఏడాది కొత్త కొత్త మోడల్స్ ను ఆపిల్ కంపెనీ మార్కెట్లోకి ప్రవేశ పెడుతూ ఉంటుంది. వీటి ధర కూడా ఒక రేంజ్ లోనే ఉంటుంది. కాబట్టి ప్రీమియం ఫీచర్లు కోరుకునేవారు ఆపిల్ కంపెనీ ఫోన్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. పైగా ఆపిల్ కంపెనీ ఫీచర్ల విషయంలో.. అప్డేట్స్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాదు. భవిష్యత్తు కాలాన్ని ముందుగానే ఊహించి కొత్త కొత్త ఫీచర్లను ఫోన్లో ప్రవేశ పెడుతూ ఉంటుంది.

ఈసారి కూడా ఆపిల్ కంపెనీ ఐఫోన్ సిరీస్లలో 18 ప్రో, 18 మాక్స్ అనే మోడల్స్ అందుబాటులో తీసుకొచ్చింది. వీటికి సంబంధించి ప్రీ ఆర్డర్ తేదీలను కూడా ప్రకటించింది. సెప్టెంబర్ 9 నుంచి ఈ మోడల్స్ కు సంబంధించి ప్రీ ఆర్డర్లు మొదలవుతాయని కంపెనీ వెల్లడించింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద సెప్టెంబర్ 9 న ఉగ్రవాదులు బాంబుదాడులకు పాల్పడ్డారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 9న నాడు చనిపోయిన వారి స్మృత్యర్థం అమెరికాలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందువల్లే ఈసారి సెప్టెంబర్ 9న కొత్త మోడల్స్ కు సంబంధించి ప్రీ ఆర్డర్లు తీసుకోవద్దని ఆపిల్ కంపెనీ నిర్ణయించింది.

సెప్టెంబర్ తొమ్మిదికి బదులు.. 12వ తేదీ నుంచి ప్రీ ఆర్డర్లు మొదలవుతాయని ఆపిల్ కంపెనీ ప్రకటించింది. వాస్తవానికి సెప్టెంబర్ 9న స్టీవ్ జాబ్స్ థియేటర్లో నిర్వహించే కార్యక్రమం ద్వారా ఈ మోడల్స్ మార్కెట్లోకి రిలీజ్ చేయాలని కంపెనీ భావించింది. సెప్టెంబర్ 9 న అమెరికా వ్యాప్తంగా సంస్మరణ కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి, ఆపిల్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా ఆపిల్ కంపెనీ 6 ఎస్, 6 ఎస్ ప్రీ ఆర్డర్ విషయంలో కూడా ఇలానే చేసింది. ముందుగా సెప్టెంబర్ 9న ప్రీ ఆర్డర్లు తీసుకోవాలి అనుకున్నారు.. ఆ తర్వాత దానినే సెప్టెంబర్ 12 కు మార్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com