Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ashwini Dutt: ఆ సినిమాతో హీరో డైరెక్టర్ ఇద్దరు ఇండ్లు కొనుక్కుంటే నేను అమ్ముకుంటున్నాను : అశ్వినీదత్.

Ashwini Dutt: ఆ సినిమాతో హీరో డైరెక్టర్ ఇద్దరు ఇండ్లు కొనుక్కుంటే నేను అమ్ముకుంటున్నాను : అశ్వినీదత్.

Oktelugu.com 4 days ago

Ashwini Dutt: సినిమా ఇండస్ట్రీ లో రాణించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. లక్ష మందిలో కేవలం 100 మందికి మాత్రమే అవకాశం వస్తుంది. అందులో కేవలం 10 మంది మాత్రమే సక్సెస్ అవుతారు… ఇప్పుడున్న హీరోల్లో కొందరు వారసత్వంగా వచ్చినప్పటికి వాళ్ళకి టాలెంట్ ఉంది కాబట్టే వాళ్ళు ఇక్కడ నిలబడ్డారు… ప్రతిభ లేనివాళ్ళు షెడ్ కి వెళ్ళిపోయారు… ఒకరకంగా హీరోలు సక్సెస్ అవ్వడానికి దర్శకులు కీలకపాత్ర వహిస్తారనే విషయం మనలో చాలామందికి తెలియదు… ఒక దర్శకుడు రాసుకున్న కథలో వైవిధ్యం ఉన్నప్పుడే హీరో తన నటనను పూర్తి స్థాయిల్లో చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది…

నిజానికి దర్శకుడు రాసుకున్న కథ అత్యున్నతమైన హంగులు ఆర్భాటాలతో తెర మీదకి రావాలంటే ప్రొడ్యూసర్లు ఆ కథను నమ్మి దాని మీద పెద్ద మొత్తంలో డబ్బులను పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళ వల్లే ఆ సినిమాలు అంత గ్రాండీయర్ గా రూపొందించబడుతున్నాయి అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి అశ్వినిదత్ లాంటి ఒక భారీ ప్రొడ్యూసర్ గతంలో పెద్ద సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. మరి అలాంటి నిర్మాత ఒక సినిమా వల్ల తన పూర్తి కెరియర్ ను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నిజానికి అశ్వినిదత్ శక్తి సినిమా ప్రొడ్యూస్ చేసి భారీ నష్టాన్ని చవిచూశాడు. ఆ మూవీ వల్ల డైరెక్టర్ మెహర్ రమేష్, హీరో ఎన్టీఆర్ ఇద్దరు ఇళ్లను కొనుక్కుంటే నేను మాత్రం నా ఇల్లును అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ అశ్వినీ దత్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.

ఇక ఏది ఏమైనా కూడా తన అల్లుడైన నాగ అశ్విన్ ‘మహానటి’ సినిమాతో మళ్ళీ వర్మ బ్యానర్ ను నిలబెట్టాడు. నా అల్లుడు నేను కోల్పోయిన డబ్బులను మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు అంటూ ఆయన గతంలో కొన్ని కామెంట్లు చేశాడు. కల్కి సినిమాతో 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టారు. కాబట్టి తను ఫైనాన్షియల్ గా ఇప్పుడు స్టెబుల్ గా ఉన్నాను అంటూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏది ఏమైనా కూడా అశ్విని దత్ లాంటి ప్రొడ్యూసర్ సైతం ఒకానొక సందర్భంలో సినిమాలను నిర్మించలేక పోయాడు. కొన్ని సంవత్సరాల పాటు తమ బ్యానర్ లో ఒక సినిమా కూడా రాలేదు. దాంతో ఆయన పని అయిపోయిందని అందరు అనుకున్నారు. కానీ మొత్తానికైతే తన అల్లుడైన నాగ్ అశ్విన్ తన బ్యానర్ ను నిలబెట్టించడంతో మరోసారి వైజయంతి మూవీస్ బ్యానర్ కళకళలాడుతుందనే చెప్పాలి…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com