Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలయ్య ఎవరినైతే నమ్ముతాడో వాళ్లే మోసం చేస్తున్నారా...

బాలయ్య ఎవరినైతే నమ్ముతాడో వాళ్లే మోసం చేస్తున్నారా...

Oktelugu.com 3 months ago

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. నందమూరి తారక రామారావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన బాలయ్య తండ్రికి తగ్గ తనయుడిగా పేరును సంపాదించుకున్నాడు.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా ముందుకు దూసుకెళ్తున్నాడు. మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… 70 సంవత్సరాలకు దగ్గరవుతున్న కూడా ఆయన ఏమాత్రం అలిసిపోకుండా సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నాడు. యాంగ్ హీరోలు సైతం అతని ముందు సరిపోవడం లేదు అంటే అతని ఎనర్జీ ఏ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు… ఇక అలాంటి బాలయ్య కొంతమంది దర్శకులను నమ్మి వాళ్లకు సినిమాలను చేసే అవకాశం అయితే ఇచ్చాడు. కానీ ఆ దర్శకులు అతని నమ్మకాన్ని నిలబెట్టలేకపోయారు.

ముఖ్యంగా అతనికి సక్సెస్ లను సాధించి పెట్టిన దర్శకులు సైతం అతన్ని విమర్శల పాలు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు – బి.గోపాల్ కాంబినేషన్ లో భారీ సినిమాలైతే వచ్చాయి. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చినప్పటికి ఈ సినిమాలు బాలయ్య బాబుకి గొప్ప ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టాయి.

ఆయనే ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ సినిమా ద్వారా బాలయ్య బాబు ఇమేజ్ ను డామేజ్ చేశాడనే చెప్పాలి. తనను నమ్మి కథ కూడా వినకుండా అవకాశం ఇచ్చినందుకు బాలయ్య బాబుకు పెద్ద బొక్క పెట్టాడు అంటూ చాలామంది బి.గోపాల్ మీద ఫైర్ అయ్యారు. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు చేసిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి.

దాంతో ‘అఖండ 2’ సినిమా విషయంలో బాలయ్య బాబు పెద్దగా ఇన్వాల్వ్ కాకుండా కథ కూడా వినకుండా డైరెక్ట్ సెట్స్ లోకి వెళ్లిపోయాడు. ఆ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుంది అనుకున్నప్పటికి సినిమా ఫ్లాప్ అయింది. దాంతో ప్రొడ్యూసర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలైతే వచ్చాయి. ఇక బాలయ్య ఇమేజ్ కూడా కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. ఆ ఇద్దరు దర్శకులను బాలయ్య బ్లైండ్ గా నమ్మాడు. కానీ వాళ్ళిద్దరు అతనికి భారీ ఇమేజ్ ను ఇచ్చినట్టే ఇచ్చి తన క్రేజ్ తగ్గిపోయే సినిమాలను చేశారు…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com