Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలయ్య కథ తో రవితేజ.. ఇది కదా ఊర మాస్ కాంబినేషన్ అంటే.. పూర్తి వివరాలు ఇవే..

బాలయ్య కథ తో రవితేజ.. ఇది కదా ఊర మాస్ కాంబినేషన్ అంటే.. పూర్తి వివరాలు ఇవే..

Oktelugu.com 3 weeks ago

Balakrishna story for Ravi Teja: మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు నేటి తరం యూత్ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా తనని తాను మార్చుకున్నట్టుగా అనిపిస్తోంది.

‘ధమాకా’ తర్వాత రవితేజ చేసిన ప్రతీ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఒకప్పుడు 40 నుండీ 50 కోట్ల రూపాయిల రేంజ్ లో ఉండే రవితేజ మార్కెట్ , ఈ ఫ్లాప్స్ కారణంగా 10 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఆయన గత చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం రీసెంట్ గానే సంక్రాంతి కానుకగా విడుదలై మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 20 కోట్ల రూపాయలకు జరిగితే , కేవలం 11 కోట్ల రూపాయిలు మాత్రమే రాబట్టింది , దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు రవితేజ మార్కెట్ ఏ రేంజ్ లో పడిపోయింది అనేది.

అయితే రవితేజ ని ఈ ఫ్లాప్స్ బాగా అలర్ట్ చేశాయి. అందుకే ఇకపై ఆయన చేసే ప్రతీ సినిమా మినిమం గ్యారంటీ రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నాడు. రీసెంట్ గా ఆయన ప్రముఖ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ‘సరిపోదా శనివారం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న వివేక్ ఆత్రేయ తన తదుపరి చిత్రాన్ని బాలయ్య బాబు తో చెయ్యాలని అనుకున్నాడు. బాలయ్య కి కథ వినిపించగా, ఆయనకు తెగ నచ్చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తి అయితే కానీ, మన సినిమా సెట్స్ మీదకు వెళ్ళదని బాలయ్య క్లారిటీ ఇవ్వడం , సమయం వృధా చేయకుండా వివేక్ ఆత్రేయ అదే స్టోరీ ని రవితేజ కి వినిపించాడు. రవితేజ కి కూడా ఈ స్టోరీ తెగ నచ్చేసింది. వెంటనే ఈ సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ ఏడాది లోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రవితేజ శివ నిర్వాణ దర్శకత్వం లో ‘ఇరుముడి’ అనే చిత్రం చేస్తున్నాడు. తన ఇమేజ్ కి పూర్తి భిన్నమైన ఈ సినిమాని రవితేజ ఎంచుకోవడం తో , ఆడియన్స్ లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రియా భావాన్ని శంకర్ నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం , ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com