Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బండి భగీరథ్.. ఈ పని ఎప్పుడో చేయాల్సింది..

బండి భగీరథ్.. ఈ పని ఎప్పుడో చేయాల్సింది..

Oktelugu.com 1 week ago

Bandi Bhagirath : సాక్ష్యాలు అనుకూలంగా ఉంటాయనుకున్నారు. నిరంజన్ రెడ్డి లాంటి లాయర్ వాదిస్తాడని భావించారు. ఎలాగైనా సరే బెయిల్ లభిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు.

కానీ అవి ఏవీ జరగలేదు. పైగా న్యాయస్థానాలలో అడుగడుగునా చుక్కెదురైంది. పైగా ఇవన్నీ కూడా రాజకీయంగా ఒత్తిడి కలిగిస్తున్న నేపథ్యంలో తప్పలేదు.. తప్పుకునే అవకాశం లేదు. మొత్తంగా ఇన్ని రోజులపాటు కనిపించకుండా పోయిన బండి భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

ఈ చట్టం మీద.. ఈ వ్యవస్థ మీద నమ్మకము కచ్చితంగా ఉన్నప్పుడు.. బెయిల్ కోసం కాకుండా.. ముందుగానే పోలీసుల ఎదుట లొంగిపోయి ఉంటే చాలా బాగుండేది. పైగా అతడి మీద జనాలకు సింపతీ కూడా పెరిగేది. అవన్నీ కాదనుకొని.. ఒక అమ్మాయి తన మీద చేసిన ఆరోపణలకు స్పష్టమైన సమాధానం చెప్పలేకుండా.. పైగా ఆమెకు కౌంటర్గా పోలీస్ కేసులు కూడా పెట్టి.. తన స్థాయి నిరూపించుకున్నాడు భగీరథ్. కానీ ఇక్కడే అతడు తప్పు చేశాడు. ఎందుకంటే ఆమె తాను మైనర్ అని పదేపదే చెప్పింది. ఈ క్రమంలో అత్యంత కఠినమైన కేసు అతని మీద నమోదయింది. రాజకీయంగా కూడా ఈ వ్యవహారం దుమారం రేపడంతో.. రేవంత్ రెడ్డి స్వయంగా కల్పించుకొని ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బండి భగీరథ్ వ్యవహారం రోజుకో మలుపు తిరిగింది.

నిరంజన్ రెడ్డి లాంటి ఖరీదైన లాయర్ ను నియమించుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో భగీరథ్ కు అన్ని దారులు మూసుకుపోయాయి. గత్యంతరం లేక.. ఏం చేయాలో తెలియక పోలీసుల ముందు లొంగిపోయాడు. వాస్తవానికి ఈ పని గనుక అతడు ముందే చేసి ఉంటే ఇక్కడిదాకా వచ్చేది కాదు.

తను ఒక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కొడుకు. పైగా తన తండ్రి ఆ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఆ విషయం తెలిసి కూడా భగీరథ్ ఇలా చేయడం అత్యంత దారుణం. ఇప్పటికే భగీరథ్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆయన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కూడా ఇబ్బంది పడుతోంది. ఇలాంటి అప్పుడు తనకు తల వంపులు తెచ్చిన తనయుడిని జైలుకు పంపించడమే మంచిది. లేకపోతే బండి సంజయ్ ఇంకా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ప్రత్యేకించి గులాబీ పార్టీ సోషల్ మీడియా నుంచి.. ఆ పార్టీ కార్యకర్తల నుంచి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com