Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ కు మిగిలింది గాడిద గుడ్డు

బంగ్లాదేశ్ చేతిలో పాకిస్తాన్ కు మిగిలింది గాడిద గుడ్డు

Oktelugu.com 4 days ago

Bangladesh vs Pakistan: ఈ శీర్షిక చదివిన తర్వాత మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇదేంటి ఇలా పెట్టారు అని అనుకోవచ్చు.. మీకు అలా అనిపించడంలో తప్పులేదు.

కానీ ఈ హెడ్లైన్ పెట్టడం వెనక స్టోరీ మొత్తం మాకు తెలుసు కాబట్టి.. అలా పెట్టడంలో ఏమాత్రం తప్పులేదు.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ కంటే పాకిస్తాన్ చాలా మెరుగు. పైగా అనేక సిరీస్ లు సొంతం చేసుకున్న చరిత్ర పాకిస్తాన్ కు ఉంది. అయితే ఆ స్థాయిలో ఆడిన పాకిస్తాన్ జట్టు ఇప్పుడు దారుణంగా ఆడుతోంది. బంగ్లాదేశ్ చేతిలో గతంలోనే వైట్ వాష్ కు గురైన పాకిస్తాన్.. ఇప్పుడు బంగ్లాదేశ్ చేతిలో మరోసారి ఆ పరాభవాన్ని మూటగట్టుకుంది. గతంలో సొంత దేశంలో వైట్ వాష్ కు గురైతే.. ఇప్పుడు ఆతిథ్య జట్టు దేశంలో మరోసారి గుండు సున్నా చుట్టేసుకుంది.

రెండో టెస్టులో బంగ్లాదేశ్ పాకిస్తాన్ పై 78 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. రెండో టెస్ట్ చివరి రోజున పాకిస్తాన్ చేజింగ్ మొదలుపెట్టింది. ఆ సమయంలో పాకిస్తాన్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. అప్పటికే 7 వికెట్లు కోల్పోయింది..క్రీజులో ఉన్న మహమ్మద్ రిజ్వాన్.. వరుసగా రెండు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించాడు. అప్పటికే పాకిస్తాన్ విజయానికి ఇంకా 121 పరుగులు కావాలి. ఈసారి టస్కిన్ అహ్మద్ బౌలింగ్లో సాజిద్ ఖాన్ వరుస బంతులలో బౌండరీలు కొట్టాడు. రిజ్వాన్, సాజిద్ ఖాన్ కీలకమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. సాజిద్ ఖాన్ టైజు ల్ ఇస్లాం బౌలింగ్లో ఔట్ అయ్యాడు.. మరోవైపు రిజ్వాన్ 94 పరుగులు చేసి.. టైజుల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తైజుల్ ఏకంగా ఆరు వికెట్లు సాధించి పాకిస్తాన్ పతనాన్ని శాసించాడు.

టెస్ట్ ఫార్మాట్లో పాకిస్తాన్ జట్టుపై బంగ్లాదేశ్ కు ఇది వరుసగా నాలుగో విషయం. ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు లిటన్ దాస్. ఫలితం బంగ్లాదేశ్ వైపు ఉండేలా చేశాడు. అతడికి మెన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. ముష్ఫికర్ రహీం కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ పురస్కారం లభించింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 278 పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్ లో 390 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో 232 పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్ లో 358 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com