Dailyhunt
బయట ఇష్టం వచ్చినట్టు తినడం కాదు.. ఇంటి తిండి తింటే ఎన్ని ప్రయోజనాలంటే..

బయట ఇష్టం వచ్చినట్టు తినడం కాదు.. ఇంటి తిండి తింటే ఎన్ని ప్రయోజనాలంటే..

Oktelugu.com 1 week ago

Benefits Of Eating Home Cooked Food: నేటి కాలంలో చాలామంది బయట తిండి తింటున్నారు. బయట తిండి వల్ల ఎన్ని అనర్ధాలు జరుగుతాయో తెలిసినప్పటికీ కూడా ఆ అలవాటును మానుకోలేకపోతున్నారు.

బయట తయారు చేసే ఆహార పదార్థాలలో శుచి ఉండదు. శుభ్రత అంతకంటే ఉండదు. అందులో వాడే నూనెలు.. ఇతర పదార్థాలు ఆరోగ్యానికి హానిచేస్తాయి. అందువల్ల వాటికి దూరంగా ఉండడం ఉత్తమం.

బయట తిండి తినొద్దంటున్నారు.. ఇంట్లో తిండి తింటే ప్రయోజనాలు ఏంటి.. బయట మాదిరిగా ఇంట్లో తిండిలో రుచి ఉంటుందా.. అనే ప్రశ్న మీలో ఉత్పన్నం కావచ్చు. ఇంటి తిండిలో ఉన్న ప్రయోజనాలు అనేకం. పో నివేదిక ప్రకారం ఇంట్లో వండుకునే ఆహారం ఆరోగ్యానికి చాలా వరకు మేలు చేస్తుంది. దీనివల్ల డయాబెటిక్, ఊబకాయం.. గుండె జబ్బులు రావు. అంతేకాదు మతిమరుపునకు కారణమయ్యే డిమెన్ షియా కూడా దూరం అవుతుంది.

జపాన్ దేశానికి చెందిన జరంటాలజీ ఎవల్యూషన్ అధ్యయనంలో 11,000 మంది ఇటీవల పాల్గొన్నారు. వారి సమాచారాన్ని విశ్లేషించి.. అనంతరం కీలక విషయాలను బయటపెట్టారు. మతిమరుపు నివారణలో జీవనశైలి మార్పులు ముఖ్యపాత్ర పోషిస్తున్నట్టు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. శారీరక శ్రమ.. లైఫ్ స్టైల్ వంటి అంశాలను పూర్తిగా మార్చుకోవడం వల్ల మతిమరుపు కేసులు దాదాపు 40 శాతం వరకు తగ్గినట్టు 2020లో లాన్ సెట్ కమిషన్ బయటపెట్టింది. అదే విషయాన్ని జపాన్ జరంటాలజీ ఎవల్యూషన్ అధ్యయనం వెల్లడించింది.

అనేక ప్రయోజనాలు

ఇంట్లో పండుకోవడం వల్ల ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు పెంపొందుతాయి. కూరగాయలు.. పండ్లు ఎక్కువగా తినడం వల్ల.. శుద్ధి చేసిన ఆహార పదార్థాల జోలికి వెళ్లడం తగ్గిపోతుంది.

ఇంట్లో ఆహార పదార్థాలు వండుకునేటప్పుడు శ్రమ పడాల్సి ఉంటుంది. పప్పులు.. బియ్యం.. ఇతర పదార్థాలు కొన్ని రావడానికి బయటకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటిని వండడానికి అన్ని సిద్ధం చేసుకోవాలి. దీనివల్ల శారీరక శ్రమ కలుగుతుంది.

వంట వండడం అనేది అంత సులువైన విషయం కాదు. మెదడు వేగంగా పనిచేయాలి. ఎలా ఉండాలి.. పదార్థాలు ఏ స్థాయిలో వేయాలి.. ఎంతమందికి వంట ఉండాలి.. అనే వాటిని నిర్ణయించుకోవాలి. ఆ వంటలను చేసి తీరును ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. రుచి కోసం ఎలాంటి పదార్థాలు వేయాలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. వీటివల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఫలితంగా మతిమరుపు అనేది దూరమవుతుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com