Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెంగాల్ లో గెలుపు.. నెక్ట్స్ తెలంగాణే.. కమలం దూకుడు!

బెంగాల్ లో గెలుపు.. నెక్ట్స్ తెలంగాణే.. కమలం దూకుడు!

Oktelugu.com 3 weeks ago

BJP victory in Bengal impact on Telangana: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి చరిత్ర సృష్టించింది. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా.. 15 ఏళ్లు టిఎంసి కి అడ్డాగా ఉన్న పశ్చిమ బెంగాల్లో ఈసారి కాషాయ జెండా ఎగిరింది.

ఈ విజయం, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ విజయోత్సాహంతో తెలంగాణను తదుపరి లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ఇప్పటినుంచి వ్యూహాలు రూపొందిస్తే. బెంగాల్ తరహా ఫలితమే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మేరకు కమలనాథులు రాజకీయ వ్యూహాలకు పదును పెట్టబోతున్నారు. 2023 ఎన్నికల్లో బిజెపి కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితమైంది.

తెలంగాణలో ప్రధాన వ్యూహాలు..
బీజేపీ తెలంగాణలో పట్టు సాధించడానికి బహుముఖ వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉంది. కుల ప్రాతిపదికన బీసీ, దళిత వర్గాలను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మున్నూరు కాపు వంటి బలమైన సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడం ద్వారా ఓటు బ్యాంకును పటిష్టం చేసుకుంటోంది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు, పార్టీ బలహీనంగా ఉన్న దక్షిణ. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. సంస్థాగత పటిష్టత కోసం కేంద్ర మంత్రులు, కీలక నేతలతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఏకైక ప్రత్యామ్నాయ శక్తిగా నిలిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.

వ్యూహాత్మక పర్యటనలు..
బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై పూర్తి స్థాయి పర్యవేక్షణ చేపట్టింది. ప్రధాని మోదీ, అమిత్ షా, పార్టీ అగ్రనేతలు రాష్ట్ర నాయకత్వంతో సమన్వయం సాధించేందుకు చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి కమిటీల నుంచి మోర్చాల వరకు ప్రతి విభాగాన్ని క్రియాశీలం చేస్తూ, రానున్న ఎన్నికల్లో గణనీయమైన సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో అమలు చేసిన తరహాలోనే, తెలంగాణలో కూడా కమలం పార్టీ తన పోరాట పటిమను ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com