Dailyhunt
బెంగాల్లో రసగుల్లా కంటే ఈసారి వీరే ఫేమస్.. మమత నుంచి సువేందు అధికారి వరకు చేతులెత్తి మొక్కారు

బెంగాల్లో రసగుల్లా కంటే ఈసారి వీరే ఫేమస్.. మమత నుంచి సువేందు అధికారి వరకు చేతులెత్తి మొక్కారు

Oktelugu.com 1 week ago

West Bengal elections 2026 : బెంగాల్ అంటే .. చాలామందికి గుర్తుకు వచ్చేది రసగుల్లా.. బెంగాల్ రాష్ట్రంలో రసగుల్లా విపరీతమైన ఫేమస్. ఇక్కడ అనేక రకాల రసగుల్లాలు తయారవుతూ ఉంటాయి.

ఇవన్నీ కూడా ఇక్కడ మాత్రమే కాదు విదేశాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి. బెంగాల్ వచ్చేవారు కచ్చితంగా రసగుల్లాను టేస్ట్ చేసి వెళ్తారు. బెంగాల్ తర్వాత హౌరా బ్రిడ్జి.. చేపల వంటకాలు ఇక్కడ మరింత ఫేమస్.

బెంగాల్ రాష్ట్రంలో ఈసారి రసగుల్లాల కంటే వీరు ఎక్కువ ఫేమస్ అయ్యారు.. ప్రతిరోజు వార్తల్లో కనిపించారు. దీంతో అంతటి మమతా బెనర్జీ.. బిజెపిలోని సువేందు అధికారి తమ ఈగోను పక్కనపెట్టి.. తమకున్న అధికారులను పట్టించుకోకుండా వీరి చుట్టూ తిరిగారు. చేతులెత్తి మొక్కారు. ఒక రకంగా ప్రతిరోజు వారి నామస్మరణ చేశారు. అలాగని వారేమి బెంగాల్ దుర్గామాత శిష్యులు కాదు. దుర్గామాత ఉపాసకులు అంతకంటే కాదు.

బెంగాల్ రాష్ట్రంలో ఈసారి కొత్త ఓటర్ల డామినేషన్ పెరిగిపోయింది. బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఈసారి 88 స్థానాల భవితవ్యాన్ని కొత్త ఓటర్లు నిర్దేశిస్తారని తెలుస్తోంది. గత ఎన్నికలలో అభ్యర్థులు నమోదు చేసిన మెజారిటీ కంటే ఇప్పుడు కొత్త ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఉదాహరణకు దీన్ హట ఆ నియోజకవర్గంలో 2021లో విక్టరీ మార్జిన్ 57 అయితే.. 21,600 ఓట్లు నమోదు అయ్యాయి.. దీనిని బట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 88 నియోజకవర్గాలలో భవితవ్యాన్ని తేల్చే అవకాశం ఉందంటే మామూలు విషయం కాదు. బెంగాల్ రాష్ట్రంలో 294 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 148 స్థానాలలో గెలిస్తే అధికారం దక్కినట్టే. 294 స్థానాలలో 88 స్థానాలలో గెలుపును కొత్త ఓటర్లు నిర్దేశించే స్థాయిలో ఉన్నారంటే మామూలు విషయం కాదు..

కొత్త ఓటర్లు రికార్డు స్థాయిలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఓటు వేసేందుకు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. గంటల తరబడి క్యూలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి ఓటు హక్కు విని చూసుకున్న తర్వాత కొత్త ఓటర్లు.. సోషల్ మీడియాలో ఆ ఫోటోలను పంచుకున్నారు. బెంగాల్ కోసం తాము వచ్చామని.. కొత్త బెంగాల్ నిర్మాణాన్ని చేపట్టేందుకు తమ వంతు కృషి చేశామని అన్నారు. ఈసారి ఎగ్జిట్ పోల్స్ కూడా ఇక్కడ బిజెపి, అధికార టీఎంసీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని ప్రకటించాయి..

కొత్త ఓటర్లు ఈసారి తమ ఓటు హక్కును అధికార పార్టీకి కాకుండా.. వేరే పార్టీకి అనుకూలంగా వినియోగించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొన్ని మీడియా సంస్థలు ప్రత్యేకంగా కొత్త ఓటర్లతో సంభాషించాయి. ఈ సందర్భంగా తాము ఎందుకు ఓటు వేసాము.. ఎందుకు ఓటు హక్కు నమోదు చేసుకున్నాము.. ఎందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చాము.. అనే విషయాలను కొత్త ఓటర్లు మొహమాటం లేకుండా పంచుకున్నారు. ఈ ప్రకారం ఈసారి బెంగాల్ మార్పు వైపు పయనించినట్టు తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com