Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Big TV TV9 Telugu: బిగ్ టీవీ, టీవీ9 లో ఊహించని మార్పులు

Big TV TV9 Telugu: బిగ్ టీవీ, టీవీ9 లో ఊహించని మార్పులు

Oktelugu.com 1 day ago

Big TV TV9 Telugu: బిగ్ టీవీ యాజమాన్యానికి వైసీపీ 60 కోట్ల ప్యాకేజీ ఇచ్చింది. అందువల్లే డీఎస్సీ మీద విపరీతంగా వార్తలను ప్రసారం చేసింది. పైగా అందులో నుంచి వేములపల్లి అశోక్ అనే సీనియర్ ఉద్యోగి బయటికి వచ్చారు.

బిగ్ టీవీలో వైసిపి అనుకూల వార్తలు వచ్చే విధంగా వై నరసింహ రావు అనే సీనియర్ జర్నలిస్టుని కూడా తీసుకున్నారు. వైసిపి అనుకూల వాయిస్ మాత్రమే అందులో వినిపించేలా చేస్తున్నారు.. దీనికోసం జగన్ 60 కోట్ల వరకు బిగ్ టివి యాజమాన్యానికి ఇచ్చారు.. ఇది కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారం.. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు. కాకపోతే నేటి కాలంలో సోషల్ మీడియాలో ఎలా ఉంటుందంటే.. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్టుగా సాగిపోతుంది.

బిగ్ టీవీ ఇప్పటికే ఈ ఆరోపణలను ఖండించింది. తమ ఎడిటోరియల్ పాలసీలో ఎవరు అడుగు పెట్టలేరని.. తమకు కావలసినంత ఆర్థిక సంపత్తి ఉందని ప్రకటించింది. దీంతో బిగ్ టీవీ మీద కొంతమంది పనికట్టుకొని చేస్తున్న ప్రచారం గాలిలో కొట్టుకుపోయిన పేలపిండి లాగా మారిపోయింది. బిగ్ టీవీ విషయాన్ని అలా ఉంచితే.. టీవీ9 గురించి మరో ప్రస్తావన మొదలైంది.. టీవీ9 లోకి రవి ప్రకాష్ మళ్ళీ వస్తున్నారని ఇటీవల మళ్లీ ప్రచారం మొదలైంది. ఇటీవల టీవీ9లోకి సీనియర్ జర్నలిస్ట్ ఐ వెంకట్రావ్ కుమారుడు అనిల్ చేరారు. ఆయన అబ్జర్వేటరీ ఎడిటర్ గా కొనసాగిపోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎడిటోరియల్ కార్యకలాపాలలో అనిల్ ముఖ్యపాత్ర పోషిస్తారని ప్రచారం జరుగుతోంది. టీవీ9 లో మేఘా కంపెనీకి ఉన్న వాటాలను టిడిపి అనుకూలమైన వ్యక్తులు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అందువల్లే ఐ వెంకట్రావు కుమారుడు అందులో చేరినట్టు ప్రచారం జరుగుతోంది. మై హోమ్ గ్రూప్ వినతి మేరకు రజనీకాంత్ ను అందులో కొనసాగించడానికి ఒప్పుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

టీవీ9 మీద ఇటువంటి ఆరోపణలు చాలా ఉన్నప్పటికీ.. గతంలో ఎన్నడు కూడా ఈ స్థాయిలో అవి వినిపించలేదు. కానీ ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. రజనీకాంత్ కూడా ఒకప్పటి మాదిరిగా దూకుడుగా వ్యవహరించడం లేదు. రవి ప్రకాష్ కూడా తెర వెనుక ఏదో గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే టీవీ9లో వ్యవహారం టిడిపికి అనుకూలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిని అబద్ధమని కొట్టిపారేసే వారు కూడా ఉన్నారు. మై హోమ్ తో పాటు మేఘా కంపెనీకి కూడా ఇందులో వాటాలు ఉన్నాయి. ఈ వాటాలను వదులుకోవడానికి మేఘా కంపెనీ సిద్ధంగా లేదు. అలాంటప్పుడు రజనీకాంత్ పెత్తనానికి కత్తెర వేయడం.. ఇంకా రకరకాల మార్పులు అనేవి కేవలం ఊహాగానాలు మాత్రమేనని సీనియర్ జర్నలిస్టులు పేర్కొంటున్నారు. ఇందులో వాస్తవం ఎంతుంది.. అబద్ధం ఎంతుంది అనే విషయాలను పక్కన పెడితే.. టీవీ9 మీద ప్రచారం ఇలా సాగిపోతూనే ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com