Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bigg Boss Telugu 10: తేజస్విని కోసం 'బిగ్ బాస్ 10' టీం విశ్వ ప్రయత్నాలు.. ఆమె అడుగుతున్న రెమ్యూనరేషన్ ఎంతంటే!

Bigg Boss Telugu 10: తేజస్విని కోసం 'బిగ్ బాస్ 10' టీం విశ్వ ప్రయత్నాలు.. ఆమె అడుగుతున్న రెమ్యూనరేషన్ ఎంతంటే!

Oktelugu.com 2 weeks ago

Bigg Boss Telugu 10: ఈ ఆదివారం 'బిగ్ బాస్ 10' గ్రాండ్ గా లాంచ్ అవ్వబోతుంది. ఈ సీజన్ కోసం కోట్లాది మంది ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.

ఎందుకంటే గత సీజన్ టెలివిజన్ హిస్టరీ లో క్రియేట్ చేసిన సునామీ అలాంటిది మరీ. అందుకే ఈ సీజన్ పై అంచనాలు పెరిగిపోయాయి. అంతే కాకుండా ‘అగ్ని పరీక్ష 2’ కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ షో లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు దుమ్ము లేపేస్తున్నారు, ఎవరిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలి?, అందరూ చాకులు లాగా ఉన్నారు అని జడ్జీలు సైతం అయ్యోమయానికి గురి అవుతున్నారంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు అంటున్నారు. అయితే ‘అగ్ని పరీక్ష 2’ ద్వారా ఇంతటి ఫేమ్ తెచ్చుకున్న ఈ కంటెస్టెంట్స్ ని ఎదురుకోవాలంటే, బిగ్ బాస్ హౌస్ లోపల సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కూడా అదే రేంజ్ లో ఉండాలి.

అందుకే అత్యంత ప్రజాధారణ ఉన్నటువంటి సెలబ్రిటీస్ ని ఎంచుకున్నారు. అయితే సెలబ్రిటీ కోటా లో ఇంకా మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే సెలబ్రిటీస్ లో మగవాళ్ళు ఎక్కువ అయిపోవడం తో , లేడీ కంటెస్టెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా అమర్ దీప్ సతీమణి, ప్రముఖ టీవీ సీరియల్ హీరోయిన్ తేజస్విని గౌడ ని సంప్రదించారట మేకర్స్. తేజస్విని కి ‘బిగ్ బాస్’ పై ఆసక్తి ఉంది. గత సీజన్ లోనే ఈమె రావాల్సి ఉంది. కానీ రెమునేరుషన్ ఆఫర్ నచ్చక రాలేకపోయింది. కనీసం ఈ సీజన్ కి అయినా ఆమెని తీసుకొని రావాలని మేకర్స్ పట్టుబట్టారు. కానీ కుదర్లేదు. ఇప్పుడు మరో ముగ్గురు ఫిమేల్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అవసరం అవ్వడం తో , మరోసారి తేజస్విని ని సంప్రదించారట మేకర్స్. ప్రస్తుతం ఆమె తమిళం లో ‘ఆయాలి’ అనే సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తోంది.

జీ తెలుగు లో ప్రసారం అవుతున్న ‘జగద్దాత్రి’ సీరియల్ కి ఇది రీమేక్. ఇక్కడ ఎంత పెద్ద హిట్ అయ్యిందో , తమిళం లో అంతకు మించి హిట్ అయ్యింది. రెమ్యూనరేషన్ కూడా తేజస్విని కి భారీ గానే అందుతోంది. అలాంటి సీరియల్ ని వదిలి రావాలనుంటే కష్టమే కదా మరీ. అందుకే ఆమె వారానికి 6 లక్షల రూపాయిలు ఇస్తానంటే, ఆ సీరియల్ ని వదిలి వస్తానని చెప్పిందట మేకర్స్ తో. 6 లక్షలు అంటే, 15 వారాలకు 90 లక్షల వరకు ఆమెకు రెమ్యూనరేషన్ వస్తుంది. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నారు అట, చూడాలి మరి ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో అనేది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com