Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Brazil Waterfall: ఆకాశం నుంచి జలపాతం.. కళ్లింతలు చేసుకుని చూడాల్సిందే.. వైరల్ వీడియో

Brazil Waterfall: ఆకాశం నుంచి జలపాతం.. కళ్లింతలు చేసుకుని చూడాల్సిందే.. వైరల్ వీడియో

Oktelugu.com 1 day ago

Brazil Waterfall:ప్రకృతి ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు మన కళ్ళముందే కనిపించే దృశ్యాలు నిజమా? లేక ఏఐ సృష్టించిన అద్భుతమా?

అనే సందేహాన్ని కలిగిస్తాయి. బ్రెజిల్ దేశంలో కాసా డి పెడ్రా (Casa de Pedra) గో దగ్గర కనిపించిన ఒక అద్భుతమైన దృశ్యం ఇప్పుడు అలాంటి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గుహ పైభాగం నుంచి నీరు కిందకు జాలు వారు తుంటే.. లోపల నుంచి పైకి చూసేవారికి ఆకాశం నుంచే జలపాతం కురుస్తున్నట్టుగా అనిపిస్తోంది.

ఈ గుహ ప్రత్యేకత దాని విశాలమైన ముఖద్వారం..సావో పాలో రాష్ట్రంలోని ఇపొరంగా ప్రాంతంలో, ఆల్టో రీబీ రా టూరిజం స్టేట్ పార్క్ (PETAR) పరిధిలో ఉన్న కాసా డి పెడ్రా గుహ ముఖద్వారం ఎత్తును పరిశోధకులు ఆధునిక లేజర్ సాంకేతికతతో కొలిచారు. ఈ అధ్యాయంలో దాని ఎత్తు సుమారు 197 మీటర్లు. అంటే దాదాపుగా 646 అడుగులు. గుహ పైభాగంలో రాత్రి నిర్మాణాల నుంచి నీరు కిందకు వస్తున్నప్పుడు ఆ దృశ్యం మరింత అద్భుతంగా ఉంటుంది. గుహలోపల చీకటి.. ఎదురుగా కనిపించే వెలుతురు.. ఎత్తు నుంచి పడే నీటి ధారలు కలిసి ఒక ప్రత్యేకమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. అందుకే ఈ దృశ్యాన్ని చూసిన వారికి ఆకాశమే నీటిని కిందకు జార విడుస్తున్నట్టుగా అనిపిస్తుంది.

ప్రకృతి రూపొందించిన ఈ అందమైన దృశ్యం వెనుక ప్రమాదం కూడా పొంచి ఉంది. భారీగా వర్షాలు కురిసినప్పుడు.. గుహలో నీటిమట్టం వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. గతంలో వరదల కారణంగా ప్రాణ నష్టం జరిగింది. అందువల్ల ఈ గుహను 2003 నుంచి సాధారణ సందర్శకులు చూసే వీరు లేకుండా మూసివేశారు. ప్రస్తుతం అనుమతి పొందిన పరిశోధకులు.. సంబంధిత అధికారులు మాత్రమే అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఏ ఐ సృష్టించిన దృశ్యాలు నిజమైన ప్రకృతి అద్భుతాలను తలపిస్తున్న ఈ నేటి కాలంలో.. బ్రెజిల్ దేశంలో వైరల్ గా మారిన ఈ దృశ్యానికి సంబంధించిన ప్రదేశం ఆసక్తిని కలిగిస్తోంది.

ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో ఈ జలపాతానికి విశేషమైన ప్రాచుర్యం లభిస్తోంది. అయితే పర్యాటకులను అనుమతించడం లేదు. కేవలం ప్రత్యేక అనుమతి పొందిన పర్యాటకులు, అధికారులు మాత్రమే అక్కడికి వెళ్లే అర్హత ఉంది. ఈ ప్రాంతంలో పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు. దీని వెనుక ఉన్న మరిన్ని మర్మాలను వెలికి తీసే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com