Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
business failure in india : 90 శాతం బిజినెస్ లో ఇండియాలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి?

business failure in india : 90 శాతం బిజినెస్ లో ఇండియాలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి?

Oktelugu.com 4 days ago

Business failure in india ఉద్యోగం చేయడం కంటే సొంతంగా వ్యాపారం చేయడం ఎంతో బెటర్ అని చాలామంది భావన. దీంతో మన దేశంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త వ్యాపారాలు ప్రారంభమవుతున్నాయి.

అయితే వాటిలో కొన్ని మాత్రమే విజయవంతంగా రన్ అవుతున్నాయి. మరికొన్ని మాత్రం మధ్యలోనే ఆగిపోవడం లేక పూర్తిగా తొలగించడం జరుగుతుంది. ఇలా కావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ఒక వ్యాపారం విజయవంతం కావాలంటే కస్టమర్స్ తో సరైన అవగాహన ఉండడం చాలా అవసరం. ఇలా ఉండాలంటే ఒక ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేసుకోవాలి.అది ఒక వెబ్సైట్ అయితే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వెబ్సైట్ తయారు చేయడానికి ఒకప్పుడు రూ. 50,000 వరకు ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు ఎలాంటి ఖర్చు లేకుండా ఏఐ టూల్ ద్వారా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..

వెబ్సైట్ అనేది ఒక వ్యాపారానికి డిజిటల్ అడ్రస్‌లా పనిచేస్తుంది. ఇందులో సంస్థ వివరాలు, ఉత్పత్తులు లేదా సేవలు, ధరలు, సంప్రదింపు వివరాలు, కస్టమర్ ఫీడ్‌బ్యాక్ వంటి సమాచారాన్ని ఒకే చోట అందుబాటులో ఉంచవచ్చు. దీంతో కస్టమర్లు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఆ వ్యాపారం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది వ్యాపార విశ్వసనీయతను కూడా పెంచుతుంది.

గతంలో ఒక ప్రొఫెషనల్ వెబ్‌సైట్ తయారు చేయించుకోవాలంటే రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు అయ్యేది.కానీ
ఇప్పుడు Emergent AI అనే టూల్
ద్వారా ఎలాంటి కోడింగ్ పరిజ్ఞానం లేకుండానే వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌ను కూడా రూపొందించుకోవచ్చు. వినియోగదారుడి తన అవసరాన్ని సాధారణ భాషలో ప్రాంప్ట్ రూపంలో ఇవ్వగానే వెబ్‌సైట్ లేదా యాప్‌ను రూపొందిస్తుంది.

ఉదాహరణకు ఒక దుస్తుల షాప్ కోసం ఆన్‌లైన్ వెబ్‌సైట్ కావాలి. లేదా రెస్టారెంట్ కోసం ఫుడ్ ఆర్డర్ వెబ్‌సైట్ రూపొందించు. అనే ప్రాంప్ట్ ఇవ్వగానే తగిన డిజైన్, పేజీలు, ఫారమ్‌లు, సంప్రదింపు వివరాలు, ఇతర ఫీచర్లతో కూడిన వెబ్‌సైట్‌ను సిద్ధం చేస్తుంది. అవసరమైతే తర్వాత అందులోని కంటెంట్‌ను కూడా సులభంగా మార్చుకోవచ్చు.

అయితే వెబ్‌సైట్ రూపొందించుకోవడం మాత్రమే కాదు.. అందులో సరైన సమాచారం, నాణ్యమైన ఫోటోలు, క్రమం తప్పకుండా అప్డేట్లు, వేగవంతమైన కస్టమర్ స్పందన ఉంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com