Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చంద్రబాబు గరిట తిప్పారు.. ఫేమస్ నెల్లూరు చేపల కూర వండారు..

చంద్రబాబు గరిట తిప్పారు.. ఫేమస్ నెల్లూరు చేపల కూర వండారు..

Oktelugu.com 5 days ago

Chandrababu Naidu : చంద్రబాబు ను హైటెక్ ముఖ్యమంత్రి అంటారు. అని ఆయన ఊర మాస్ అనే పదానికి పర్యాయపదం. ఆయన ఎప్పుడు క్లాస్ గా ఉండాలని అనుకుంటారు. కానీ, తనలో ఉన్న మాస్ అప్పీయరెన్స్ చూస్తే పసుపు పార్టీ అభిమానులు ఈలల మీద ఈలలు వేస్తారు.

ఇక గోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చంద్రబాబు 2024 లో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సరికొత్తగా కనిపిస్తున్నారు. హైటెక్ ముఖ్యమంత్రిగా తనకున్న పేరును.. సరికొత్తగా మార్చుకుంటున్నారు. ఊర మాస్ అవతారంలో కనిపిస్తున్నారు. తాజాగా ఏపీలో నెల్లూరు జిల్లాలో తుమ్మలపెంట ప్రాంతంలో జరిగిన మత్స్యకారుల సేవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ వెళ్లి చేపలను కొనుగోలు చేశారు. ఆ తర్వాత గిరిబాబు అనే మత్స్యకారుడు ఇంటికి చంద్రబాబు వెళ్లారు. అతడు చేపల కూర వండుతుండగా.. చూశారు. తాను కూడా గరిట తిప్పి.. నెల్లూరు స్టైల్ చేపల కూరను అదిరిపోయే రేంజ్ లో వండారు.

కూర మొత్తం ఉడికిన తర్వాత గిరిబాబు కుటుంబ సభ్యులతో కలిసి చేపల కూరతో ఆహారం తిన్నారు. సాధారణంగా తినే తిండి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే చంద్రబాబు.. ఈసారి మాత్రం తన శైలికి భిన్నంగా ఆహారం తిన్నారు. చేపల కూరను ఆస్వాదించారు. “నెల్లూరులో చేపల కూర ఎలా వండుతారు.. పచ్చి మామిడి ముక్కలు వేస్తేనే ఆ రుచి వస్తుందా.. సముద్రంలో ఎన్ని రోజులు వేటకు వెళ్తారు.. ఎన్ని రకాల చేపలు వేటలో లభ్యమవుతాయి.. మార్కెట్లో ధర ఎలా ఉంటుంది” ఈ విషయాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

చంద్రబాబు సాధారణంగా భోజనం చేయరు. ఆయన ఉదయం పూట మిల్లెట్స్ తో తయారుచేసిన టిఫిన్ తింటారు. కొవ్వు తీసిన పాలతో తయారుచేసిన కాఫీని తాగుతారు. అందులో షుగర్ వేసుకోరు. మధ్యాహ్నం కొర్రలు లేదా సామలు తింటారు. అందులో గ్రిల్డ్ ఫిష్ ఒక ముక్క ఉండేలా చూసుకుంటారు. సాయంత్రం ఫ్రూట్ సలాడ్ తింటారు. రాత్రి ఉడికించిన శనిగలు, రెండు పుల్కాలు తింటారు. సంవత్సరాలుగా చంద్రబాబు ఇదే డైట్ పాటిస్తున్నారు. అందువల్లే ఈ వయసులో కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. యువకుల కంటే వేగంగా పనిచేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com