Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చంద్రబాబు,లోకేష్ కు రోజా సలహా!

చంద్రబాబు,లోకేష్ కు రోజా సలహా!

Oktelugu.com 1 week ago

Roja Comments On Lokesh: అమ్మ పెట్టదు.. అడుక్కొని తినివ్వదు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. దేశవ్యాప్తంగా పొదుపు మంత్రం పాటించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

ఇంధన పొదుపు పాటించాలని సూచించారు. వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని ప్రత్యేక విమానాల్లో కాదు.. రైళ్లలో ప్రయాణం చేయాలని సూచించారు.అయితే దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పింది ఏంటి? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఏంటి?? అనేది పొలిటికల్ సర్కిల్లో ఒక హాట్ టాపిక్ అయ్యింది. నిన్ననే సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులు తమ కాన్వాయ్ లను తగ్గించుకున్నారు. గతం కంటే చాలా వాహన శ్రేణిని తగ్గించారు.

* కాన్వాయ్ ల తగ్గింపు పై
ఏదైనా మంచి పని చేస్తే అభినందించాలి. లేకుంటే మౌనంగా ఊరుకోవాలి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయడం లేదు. మాజీ మంత్రి రోజా స్పందించారు కాన్వాయ్ ల తగ్గింపు పై. మంచి విషయమే అయినా.. ఇప్పుడు ఆమె మరో సలహా ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు ను వాయిదా వేయాలని సూచిస్తున్నారు. వాయిదా వేసి పొదుపు పాటించవచ్చు కదా అని చంద్రబాబుతో పాటు లోకేష్ కు సలహా ఇస్తున్నారు. ప్రభుత్వపరంగా దుబారా ఖర్చు తగ్గించారు. పార్టీ కార్యక్రమంగా మహానాడు ను నిర్వహిస్తున్నారు. అది వారి సొంత పార్టీ నిర్ణయం. దానిని కూడా విమర్శిస్తే ఎలా? అనే ప్రశ్న వినిపిస్తోంది. అందులో కడుపు మంట తప్ప మరొకటి కనిపించడం లేదు.

* అదో సంప్రదాయంగా..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ జన్మదినం, జయంతి సందర్భంగా ఏటా మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నికలతో పాటు ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది నెల్లూరులో మహానాడు నిర్వహిస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో తెలుగుదేశం పార్టీని ఫాలో అయ్యింది. టిడిపి మహానాడు మాదిరిగానే ప్రతి సంవత్సరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఏర్పాటు చేస్తామన్నది అప్పట్లో ఆ పార్టీ నుంచి వచ్చిన ప్రకటన. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి నిర్వహించి వదిలేసారు. కానీ టిడిపి అలా కాదు. దానిని ఒక ఆనవాయితీగా కొనసాగిస్తోంది. తమ పార్టీ ప్లీనరీ విషయంలో రోజా అధినేత జగన్మోహన్ రెడ్డిని అడగలేరు కానీ.. టిడిపి మహానాడు ను వాయిదా వేయమని సూచిస్తున్నారు. దీనిపై టిడిపి శ్రేణులు స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతున్నాయి రోజాపై.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com