Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిరంజీవి ఇంకా ఎన్ని సినిమాలు చేస్తారో తెలుసా..?

చిరంజీవి ఇంకా ఎన్ని సినిమాలు చేస్తారో తెలుసా..?

Oktelugu.com 1 week ago

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్నాడు. గత 50 సంవత్సరాల నుంచి ఆయన సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు.

ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చో బెట్టాయి. ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా ఆయన పలు జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు… 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఆయన ఇప్పటికి హీరోగా రాణిస్తూ కమర్షియల్ సక్సెస్ లను సాధిస్తున్నాడు అంటే నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు తన రేంజ్ కి సరిపడా లేవని కొన్ని విమర్శలైతే వస్తున్నాయి. ఇక వీటన్నింటికి చెక్ పెట్టడానికే ఇప్పుడు వరుసగా మరో రెండు సినిమాలకైతే కమిట్ అయ్యాడు. బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో కమర్షియల్ సక్సెస్ ని సాధించడమే కాకుండా విమర్శకుల నుంచి వచ్చే కామెంట్లను కూడా మూయించాలనే ప్రయత్నంలో చిరంజీవి ఉన్నాడు.

ఇక ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయడానికి కూడా తను సన్నాహాలు చేసుకుంటున్నాడు. వీళ్లిద్దరి సినిమాల తర్వాత నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంలో కూడా సరైన క్లారిటీ రావడం లేదు. ఇంకా ఎన్ని సినిమాలు చేస్తాడు సోలో హీరోగా అతను ఎప్పటి వరకు రాణిస్తాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది…

నిజానికి చిరంజీవి తన చివరి శ్వాస వరకు ఇండస్ట్రీ లోనే కొనసాగుతానని గతంలో చాలాసార్లు చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా మిగతా హీరోలందరు సరైన సక్సెసులు లేక సతమతమవుతుంటే చిరంజీవి మాత్రం మంచి విజయాలను సాధించినా కూడా అతని రేంజ్ సక్సెసు లైతే రావడం లేదనేది విమర్శకుల వాదన…

రాబోయే రోజుల్లో చిరంజీవి ఇంతకు ముందు సాధించిన విజయాలను దాటి భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది… దానికితోడు ఇప్పుడున్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియాలో తమ హవాను క్రియేట్ చేస్తుండడం కూడా చిరంజీవి మీద కొంత ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది… మొత్తానికైతే సీనియర్ హీరోల్లో ప్రస్తుతం చిరంజీవి మొదటి స్థానంలో కొనసాగుతుండటం విశేషము…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com